ఈ నెలలోనూ ఎండలెక్కువే!
దేశంలో చలి తీవ్రత పెరగాల్సిన నవంబర్లోనూ ఎండలు మండిపోనున్నాయి. దేశంలో చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ)వెల్లడించింది. హిమాలయ పర్వత పాద ప్రాంతాల్లో మాత్రం సాధారణ లేదా అంతకంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తన నెలవారీ నివేదికలో తెలిపింది. అయితే మధ్య, తూర్పు భారతదేశంలోని పలు ప్రాంతాల్లో సాధారణం లేదా అంతకంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
- చలి తీవ్రత పెరగాల్సిన సమయంలో భిన్న వాతావరణం
న్యూఢిల్లీ: దేశంలో చలి తీవ్రత పెరగాల్సిన నవంబర్లోనూ ఎండలు మండిపోనున్నాయి. దేశంలో చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ)వెల్లడించింది. హిమాలయ పర్వత పాద ప్రాంతాల్లో మాత్రం సాధారణ లేదా అంతకంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తన నెలవారీ నివేదికలో తెలిపింది. అయితే మధ్య, తూర్పు భారతదేశంలోని పలు ప్రాంతాల్లో సాధారణం లేదా అంతకంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
నవంబర్‌లో దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ అంచనా వేసింది. మధ్య, వాయవ్య, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం సాధారణం నుంచి అధిక వర్షాలు కురిసే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా నవంబర్‌లో దీర్ఘకాలిక సగటు వర్షపాతం(ఎల్పీఏ)లో 77 శాతం మాత్రమే నమోదయ్యే అవకాశం ఉంది. మరోవైపు పసిఫిక్ మహా సముద్రంలో ప్రస్తుతం అత్యంత బలమైన ఎల్‌నినో పరిస్థితులు కొనసాగుతున్నాయి. నవంబర్, డిసెంబర్ నెలల్లోనూ ఇవి కొనసాగవచ్చని వాతావరణ నమూనాలు సూచిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌కు మరో తుపాను ముప్పు
బంగాళాఖాతంలోమరో తుపాను ఏర్పడబోతున్నది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శనివారం ఆరు గంటల్లో వాయు గుండంగా, 24 గంటల్లో తుపానుగా బలపడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. దీనికి ‘మురాసు’ అనే పేరు పెట్టనున్నారు. నవంబర్ 3న తెల్లవారుజామున ఏపీ తీరాన్ని తాకే అవకాశం ఉంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

