గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత
గిగ్, ప్లాట్‌ఫామ్, అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీరి సంక్షేమ కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు ‘నేషనల్ సోషల్ సెక్యూరిటీ బోర్డ్ ఫర్ అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ అండ్ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్'ను ఏర్పాటు చేస్తూ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది.
- ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసిన కేంద్రం
న్యూఢిల్లీ: గిగ్, ప్లాట్‌ఫామ్, అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీరి సంక్షేమ కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు ‘నేషనల్ సోషల్ సెక్యూరిటీ బోర్డ్ ఫర్ అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ అండ్ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్’ను ఏర్పాటు చేస్తూ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర కార్మిక, ఉపాధిశాఖ మంత్రి ఈ బోర్డుకు అధ్యక్షత వహిస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులతో పాటు అగ్రిగేటర్ సంస్థలు, యజమానులు, కార్మిక సంఘాలు, పౌర సమాజ సంస్థల ప్రతినిధులు దీనిలో సభ్యులుగా ఉంటారు.
గిగ్, ప్లాట్‌ఫామ్, అసంఘటిత రంగ కార్మికులకు సంక్షేమ పథకాలను సిఫార్సు చేయడం, వాటి అమలును పర్యవేక్షించడం బోర్డు ప్రధాన బాధ్యతలు. బోర్డు ఏడాదిలో మూడుసార్లు నమావేశం అవుతుంది. ప్రస్తుత నోటిఫికేషన్లో కొత్త పథకాలు, నిధుల వివరాలను ప్రకటించలేదు. బోర్డు ఏర్పాటు నిర్ణయాన్ని ఆల్ ఇండియా ఎన్పీఎస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు మంజీత్ సింగ్ పటేల్ స్వాగతించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vegetables | రోజూ ఈ కూరగాయలను తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. వైద్యుల సూచన..
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
Health tips | తేనెతో గుండె రోగాలకు చెక్ పెట్టవచ్చట.. ఓ అధ్యయనంలో వెల్లడి..!
Collector Priyanka | చదువుతోనే ఆడబిడ్డకు భవిత : కలెక్టర్ ప్రియాంక పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

