జీడిమెట్ల ఆర్టీసీ డిపోలో విషాదం.. డ్రైవర్ నిర్లక్ష్యంతో మెకానిక్ సంతోష్ మృతి
హైదరాబాద్ జీడిమెట్ల ఆర్టీసీ డిపోలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు కింద పడి మెకానిక్ సంతోష్ మృతిచెందాడు. డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.
హైదరాబాద్ జీడిమెట్ల ఆర్టీసీ డిపోలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు బ్రేక్ తనిఖీ చేస్తుండగా బస్సు కింద పడి మెకానిక్ సంతోష్ (39) మృతిచెందాడు. డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.
విధుల్లో భాగంగా బ్రేక్ సమస్య తలెత్తిన ఓ ఆర్టీసీ బస్సుకు సంతోష్ కుమార్ మంగళవారం ఉదయం మరమ్మతులు చేశాడు. రిపేర్ అనంతరం బస్సు కింద నుంచి సంతోష్ బయటకు వచ్చేలోపే డ్రైవర్ బస్సును స్టార్ట్ చేసి ముందుకు తీసుకెళ్లాడు. దీంతో బస్సు చక్రాల కింద నలిగి సంతోష్ అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న జీడిమెట్ల పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

