Prabhas | ప్రభాస్ ‘కల్కి 2’లో నటించే గోల్డెన్ ఛాన్స్.. ఏజ్, జెండర్‌తో సంబంధం లేదు, టాలెంట్ ఉంటే చాలు!
Prabhas | రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్కి 2898 AD’ 2024లో విడుదలై సంచలన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. సోషియో ఫాంటసీ, మైథలాజికల్ యాక్షన్ అంశాలతో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించడంతో పాటు ‘కల్కి సినిమాటిక్ యూనివర్స్’పై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది.
Prabhas | రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్కి 2898 AD’ 2024లో విడుదలై సంచలన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. సోషియో ఫాంటసీ, మైథలాజికల్ యాక్షన్ అంశాలతో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించడంతో పాటు ‘కల్కి సినిమాటిక్ యూనివర్స్’పై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘కల్కి 2’ తెరకెక్కుతోంది. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి తాజాగా మేకర్స్ ఓ కీలక ప్రకటన చేశారు. ప్రతిభ ఉన్న ఔత్సాహిక నటీనటులకు ఈ క్రేజీ యూనివర్స్‌లో భాగమయ్యే అవకాశం కల్పిస్తూ కాస్టింగ్ కాల్ ప్రకటించారు.
నటనపై ఆసక్తి ఉండి, తమ ప్రతిభను నిరూపించుకోవాలనుకునే వారికి ఇదొక అద్భుతమైన అవకాశమని చిత్ర బృందం తెలిపింది. ఏజ్ లిమిట్ లేదని, జెండర్‌కు ఎలాంటి పరిమితులు లేవని.. కేవలం టాలెంట్ ఉంటే చాలని స్పష్టం చేసింది.‘యాక్టర్స్‌గా రాణించాలనుకునే వారందరికీ ఇదొక గొప్ప అవకాశం. ‘కల్కి సినిమాటిక్ యూనివర్స్’లో భాగం అవ్వండి’’ అంటూ మేకర్స్ సోషల్ మీడియా ద్వారా కాస్టింగ్ కాల్ ఇచ్చారు.ఆసక్తి ఉన్న నటీనటులు తమ వ్యక్తిగత వివరాలతో పాటు పోర్ట్‌ఫోలియోను kalkiuniversecasting@gmail.comకు పంపించాలని వైజయంతీ మూవీస్ పేర్కొంది.
‘కల్కి 2898 AD’ కోసం కూడా చిత్ర బృందం ఇదే తరహాలో కాస్టింగ్ కాల్ నిర్వహించింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, పుదుచ్చేరి, కొచ్చి వంటి పలు నగరాల్లో ఆడిషన్స్ నిర్వహించి కొత్త నటీనటులను ఎంపిక చేశారు.కేవలం నటీనటులకే కాకుండా డ్యాన్సర్లు, జిమ్నాస్టిక్స్‌లో నైపుణ్యం ఉన్నవారు, మార్షల్ ఆర్టిస్టులు, మోడల్స్, ఇంజినీర్లు వంటి విభిన్న రంగాలకు చెందిన ప్రతిభావంతులకు కూడా ‘కల్కి’లో అవకాశం కల్పించారు. ఇప్పుడు ‘కల్కి 2’ కోసం కూడా అదే విధానాన్ని కొనసాగించడం ఆసక్తికరంగా మారింది. భారీ స్థాయిలో విస్తరిస్తున్న ‘కల్కి సినిమాటిక్ యూనివర్స్’ లో కొత్త ముఖాలను పరిచయం చేయడానికి నాగ్ అశ్విన్, వైజయంతీ మూవీస్ చేస్తున్న ప్రయత్నంగా దీనిని భావిస్తున్నారు. ప్రభాస్ వంటి పాన్ ఇండియా స్టార్ నటిస్తున్న సినిమాలో కనిపించే అవకాశం రావడంతో ఈ కాస్టింగ్ కాల్‌పై ఔత్సాహిక నటీనటుల్లో ఆసక్తి పెరిగింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

