Vishwambara | ‘విశ్వంభర’ రిలీజ్‌పై చిరంజీవి నోటి నుంచి నేడు అప్డేట్ వస్తుందా? మెగాస్టార్ అభిమానుల్లో ఆసక్తి
Vishwambara | మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ బడ్జెట్‌తో, అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడటంతో రిలీజ్‌పై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.
Vishwambara | మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ బడ్జెట్‌తో, అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడటంతో రిలీజ్‌పై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించి మరోసారి చర్చ మొదలైంది. వశిష్ఠ మల్లిడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘విశ్వంభర’ను మొదట 2025 జనవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావించారు. అయితే షూటింగ్, నిర్మాణానంతర కార్యక్రమాలు, విజువల్ ఎఫెక్ట్స్ తదితర కారణాలతో సినిమా విడుదల వాయిదా పడుతూ వచ్చింది.భారీ స్థాయిలో గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్తో కూడిన సోషియో ఫాంటసీ కథ కావడంతో మేకర్స్ ప్రతి అంశాన్ని జాగ్రత్తగా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో సినిమాను హడావుడిగా విడుదల చేయకుండా క్వాలిటీకి ప్రాధాన్యం ఇస్తున్నట్లు సమాచారం.
ఇటీవల ‘విశ్వంభర’ 2026 అక్టోబర్ 16న థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ తేదీపై చిత్ర బృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.అందుకే అక్టోబర్ 16 రిలీజ్ డేట్ ఖరారైందని చెప్పడానికి ఇంకా అవకాశం లేదు. మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ మీట్‌కు చిరంజీవి నేడు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంపై మెగా అభిమానుల్లో ఇప్పటికే భారీ ఆసక్తి నెలకొంది. ఈ సందర్భంగా చిరంజీవి తన తదుపరి సినిమాల గురించి ఏమైనా మాట్లాడతారా? ముఖ్యంగా ‘విశ్వంభర’ రిలీజ్ డేట్‌పై ఏదైనా క్లారిటీ ఇస్తారా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ఒకవేళ చిరంజీవి ‘విశ్వంభర’ గురించి ఏదైనా కీలక అప్డేట్ ఇస్తే.. చాలా కాలంగా ఎదురుచూస్తున్న అభిమానుల్లో కొత్త ఉత్సాహం రావడం ఖాయం. ముఖ్యంగా సినిమా అక్టోబర్‌లో విడుదల కానుందనే వార్తలకు ఆయన మాటలు బలం చేకూరుస్తాయా అనేది ఆసక్తికరంగా మారింది. ‘విశ్వంభర’లో చిరంజీవి సరసన త్రిష కృష్ణన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఆషికా రంగనాథ్ కీలక పాత్రలో కనిపించనుండగా, కునాల్ కపూర్ ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నారు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ భారీ నిర్మాణ విలువలతో ఈ సినిమాను రూపొందిస్తోంది. చిరంజీవి కెరీర్లోనే విభిన్నమైన ఫాంటసీ ప్రపంచాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

