చండీగఢ్: భారీ వర్షాలు, వరదలకు ప్రభావితమైన పంజాబ్‌కు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీ రాఘవ్ చద్దా (Raghav Chadha) రూ.3.25 కోట్ల నిధులు ప్రకటించారు. పంజాబ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన ఆయన తన ఎంపీలాడ్స్ నిధుల నుంచి మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ‘ఇది పంజాబ్ డబ్బు. పంజాబ్ ప్రజల కోసం’ అని భావోద్వేగంతో అన్నారు. ఒక వీడియో ద్వారా పంజాబ్ ప్రజలకు సంఘీభావం తెలిపారు. ప్రతి ఒక్కరి భద్రత కోసం ప్రార్థించారు. వరదల కారణంగా 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినందుకు సంతాపం తెలిపారు.
కాగా, పంజాబ్‌లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయం, పునరావాసం కోసం ఈ నిధులు వినియోగిస్తామని రాఘవ్ చద్దా తెలిపారు. రూ.3.25 కోట్ల సహాయాన్ని పంజాబ్‌లోని రెండు అత్యంత ప్రభావిత జిల్లాలైన గురుదాస్‌పూర్, అమృత్‌సర్‌కు కేటాయించినట్లు చెప్పారు. గురుదాస్‌పూర్ జిల్లాలోని వరద రక్షణ కట్టలను బలోపేతం చేయడానికి, మరమ్మతుల కోసం రూ.2.75 కోట్లు, అమృత్సర్ జిల్లాలో సహాయ, పునరావాస పనులకు రూ.50 లక్షలు ఇస్తానని ఆయన తెలిపారు.
మరోవైపు చరిత్రలో అత్యంత దారుణమైన వరదలతో పంజాబ్ పోరాడుతున్నదని రాఘవ్ చద్దా తెలిపారు. పంజాబ్ వరదల అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తుతానని చెప్పారు. వరదలతో అతలాకుతలమైన రాష్ట్రానికి మద్దతు కోసం కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. వరద బాధిత ప్రజలకు సహాయ సహకారాలు అందించిన భారత సైన్యం, బీఎస్ఎఫ్, పంజాబ్ పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఎన్జీవోలు, పౌర సమాజం, స్థానిక యువత, విపత్తు నిర్వహణ బృందాలకు కృతజ్ఞతలు తెలియజేశారు.
Punjab is battling one of the worst floods in recent history. Homes destroyed, farmlands submerged, cattle lost & 30 precious lives gone.
From my MPLAD Funds, I am allocating ₹3.25 Cr towards:
• ₹2.75 Cr for strengthening flood protection embankments so that our villages… pic.twitter.com/KUxay0F8pz
— Raghav Chadha (@raghav_chadha) September 3, 2025
Also Read:
I’m your husband’s 2nd wife | నీ భర్తకు రెండో భార్యనంటూ ఫోన్.. బస్సులో కుప్పకూలి మహిళ మృతి
Woman Gives Birth To 17th Child | 55 ఏళ్ల వయస్సులో.. 17వ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ
Watch: క్యాష్ బ్యాగ్ ఎత్తుకెళ్లి, నోట్లు వెదజల్లిన కోతి.. తర్వాత ఏం జరిగిందంటే?