ముంబై: ఒక ప్రాంతంలో మహిళ తెగిన తల కనిపించింది. (Woman’s Severed Head) స్థానికంగా కలకలం రేపిన ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేశారు. భార్యను హత్య చేసి మృతదేహాన్ని ముక్కలుగా నరికి పడేసిన నిందితుడైన భర్తను అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని భివాండిలో ఈ సంఘటన జరిగింది. నగరంలోని ఈద్గా కాంప్లెక్స్ సమీపంలో మహిళ తెగిన తల కనిపించింది. ఇది చూసి స్థానికులు భయాందోళన చెందారు.
కాగా, ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. హతురాలి వయస్సు 25 నుంచి 28 ఏళ్ల మధ్య ఉంటుందని అంచనా వేశారు. నరికి పడేసిన మహిళ తలను పోస్ట్మార్టం కోసం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంట్లో గొడవల కారణంగా భార్యను భర్త దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని ముక్కలుగా నరికి పలు చోట్ల పడేసినట్లు దర్యాప్తులో తెలుసుకున్నారు. నిందితుడైన భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ మహిళ మిగతా శరీర భాగాల కోసం వెతుకుతున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
I’m your husband’s 2nd wife | నీ భర్తకు రెండో భార్యనంటూ ఫోన్.. బస్సులో కుప్పకూలి మహిళ మృతి
Ganesh Procession | గణేష్ ఊరేగింపులోకి దూసుకెళ్లిన వాహనం.. ముగ్గురు మృతి, 22 మందికి గాయాలు
Raghav Chadha | ‘పంజాబ్ డబ్బు పంజాబ్ ప్రజలకే’.. రూ.3.25 కోట్ల నిధులు ప్రకటించిన రాఘవ్ చద్దా