రాయ్‌పూర్: గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం కోసం ఊరేగింపుగా తీసుకెళ్తున్న జనంపైకి వాహనం దూసుకెళ్లింది. (Ganesh Procession) ఈ సంఘటనలో ముగ్గురు మరణించారు. 22 మంది గాయపడ్డారు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని జాష్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మంగళవారం రాత్రి జురుదండ్ గ్రామంలో నిర్వహించిన గణేష్ ఊరేగింపులో వంద మందికిపైగా స్థానికులు పాల్గొన్నారు.
కాగా, మద్యం మత్తులో డ్రైవ్ చేసిన వ్యక్తి ఎస్‌యూవీతో ఆ ఊరేగింపులోకి దూసుకెళ్లాడు. ఈ సంఘటనలో ముగ్గురు మరణించగా, 22 మంది గాయపడ్డారు. మృతులను 17 ఏళ్ల విపిన్ ప్రజాపతి, 19 ఏళ్ల అరవింద్ కెర్కెట్టా, 32 ఏళ్ల ఖిరోవతి యాదవ్‌గా గుర్తించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. సుర్గుజా జిల్లాలోని అంబికాపూర్ మెడికల్ కాలేజీకి వారిని తరలించినట్లు చెప్పారు.
మరోవైపు మద్యం సేవించి డ్రైవ్ చేసిన ఎస్యూవీ డ్రైవర్ అయిన 40 ఏళ్ల సుఖ్‌సాగర్ వైష్ణవ్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
Raghav Chadha | ‘పంజాబ్ డబ్బు పంజాబ్ ప్రజలకే’.. రూ.3.25 కోట్ల నిధులు ప్రకటించిన రాఘవ్ చద్దా
I’m your husband’s 2nd wife | నీ భర్తకు రెండో భార్యనంటూ ఫోన్.. బస్సులో కుప్పకూలి మహిళ మృతి
Watch: స్కూటర్ రివర్స్ చేస్తుండగా ఓపెన్ డ్రెయిన్‌లో పడిన దివ్యాంగుడు.. తర్వాత ఏం జరిగిందంటే?