న్యూఢిల్లీ: ఒక దివ్యాంగుడు స్కూటర్ రివర్స్ చేస్తుండగా అదుపుతప్పింది. తెరిచి ఉన్న డ్రెయిన్‌లో స్కూటర్‌తో సహా అతడు పడిపోయాడు. (Disabled Man Falls Into Open Drain) ఆ మురుగు కాలువ లోతు ఉండటంతో ఆ వ్యక్తి పైకి రాలేకపోయాడు. చివరకు కొందరు వ్యక్తుల సహాయంతో బయటకు వచ్చాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. గురువారం ఉదయం ఖోడా సుభాష్ పార్క్ ప్రాంతంలో నివసించే సంతోష్ యాదవ్ తన పిల్లలకు బర్గర్లు కొనేందుకు ఇందిరాపురం ప్రాంతానికి చేరుకున్నాడు. వైభవ్ ఖండ్‌లోని గౌర్ గ్రీన్ సొసైటీలోని షాప్‌లో బర్గర్లు కొన్న తర్వాత తిరిగి వెళ్లేందుకు స్కూటర్‌ను రివర్స్ చేశాడు.
కాగా, టైరు జారడంతో అక్కడ తెరిచి ఉన్న మురుగు కాలువలో స్కూటర్‌తో సహా సంతోష్ యాదవ్ పడిపోయాడు. మురుగు కాలువ లోతు ఎక్కువగా ఉండటంతో పైకి రాలేకపోయాడు. గమనించిన కొందరు వ్యక్తులు అతడికి సహాయం చేశారు. కర్ర నిచ్చెనను మురుగు కాలువ లోపలకు వేశారు. దీంతో దాని సహాయంతో పైకి వచ్చాడు. దివ్యాంగుడైన సంతోష్ ఈ సంఘటనలో స్వల్పంగా గాయపడ్డాడు.
మరోవైపు ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తాయి. క్లీనింగ్ కోసం తెరిచిన ఆ డ్రెయిన్‌పై తిరిగి ర్యాంప్ నిర్మించకపోవడంపై ఢిల్లీ వాసులు మండిపడ్డారు.
From Ghaziabad, Uttar Pradesh.
A young man on scooty fell into an open drain. The kids on the spot raised alert and the victim driver was rescued by onlookers using a ladder. pic.twitter.com/FP4sBk7xcP
— Piyush Rai (@Benarasiyaa) August 28, 2025
Also Read:
I’m your husband’s 2nd wife | నీ భర్తకు రెండో భార్యనంటూ ఫోన్.. బస్సులో కుప్పకూలి మహిళ మృతి
Black Magic | మొరాయించిన మ్యూజిక్ సిస్టమ్.. చేతబడి అనుమానంతో దంపతులపై దాడి, వ్యక్తి మృతి
Woman Gives Birth To 17th Child | 55 ఏళ్ల వయస్సులో.. 17వ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ
Minister Chased By Locals | మంత్రిపై దాడికి జనం యత్నం.. కిలోమీటరు దూరం వరకు వెంబడించిన వైనం