న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఆ పార్టీ మాతృసంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) మధ్య విభేదాలున్నట్లు వస్తున్న వదంతులను ఆ సంస్థ చీఫ్ మోహన్ భగవత్ (Mohan Bhagwat) ఖండించారు. సంస్థాగత వైరుధ్యాలున్నప్పటికీ, బీజేపీతో ఎలాంటి వైరం లేదన్నారు. ఆర్ఎస్ఎస్ ఏర్పడి వందేళ్లైన సందర్భంగా గురువారం ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో మోహన్ భగవత్ మాట్లాడారు. ‘ఆర్ఎస్ఎస్, బీజేపీ మధ్య పోరాటం జరిగి ఉండవచ్చు. కానీ బీజేపీతో ఎలాంటి వైరం లేదు’ అని అన్నారు. అలాగే బీజేపీ తరుపున ఆర్ఎస్ఎస్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోదని స్పష్టం చేశారు.
కాగా, కేంద్ర ప్రభుత్వంతోపాటు రాష్ట్రాలతో తమకు మంచి సమన్వయం ఉన్నదని మోహన్ భగవత్ తెలిపారు. ‘అంతర్గత వైరుధ్యాలు ఉన్న వ్యవస్థలు ఉన్నాయి. అయితే ఏ విధంగానూ గొడవ లేదు. ప్రతి ప్రభుత్వంతో మాకు మంచి సమన్వయం ఉంది’ అని అన్నారు.
మరోవైపు బీజేపీ, ఆర్ఎస్ఎస్ మధ్య పోరాటం ఉండవచ్చు కానీ గొడవ ఉండదని మోహన్ భగవత్ స్పష్టం చేశారు. ‘మనం రాజీ గురించి మాట్లాడినప్పుడు, పోరాటం తీవ్రమవుతుంది. అభిప్రాయాలు ఉండవచ్చు, కానీ మేం చర్చించుకుంటాం. సమిష్టిగా నిర్ణయం తీసుకుంటాం. ఆర్ఎస్ఎస్, బీజేపీ ‘ఒకరినొకరు విశ్వసిస్తాయి’ ఏదో ఒక సమయంలో అవి కలుస్తాయని తెలుసు’ అని అన్నారు.
Also Read:
Minister Chased By Locals | మంత్రిపై దాడికి జనం యత్నం.. కిలోమీటరు దూరం వరకు వెంబడించిన వైనం
Woman Gives Birth To 17th Child | 55 ఏళ్ల వయస్సులో.. 17వ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ
Black Magic | మొరాయించిన మ్యూజిక్ సిస్టమ్.. చేతబడి అనుమానంతో దంపతులపై దాడి, వ్యక్తి మృతి
I’m your husband’s 2nd wife | నీ భర్తకు రెండో భార్యనంటూ ఫోన్.. బస్సులో కుప్పకూలి మహిళ మృతి