HomeBusinessGovernment Loans Available For Women Through Various Schemes
ఈ లోన్లు మహిళల కోసమే.. ప్రభుత్వ రుణ పథకాలను పరిశీలిద్దామా!
మహిళల కోసం పలు పథకాల ద్వారా ప్రభుత్వ రుణాలు అందుబాటులో ఉన్నాయి. వుమెన్ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌కు దన్నుగా పూచీకత్తు లేని రుణాలు, వడ్డీపై రాయితీతో కూడిన లోన్లను అందిస్తున్నారు. మరి అవెంటో చూస్తే..
మహిళల కోసం పలు పథకాల ద్వారా ప్రభుత్వ రుణాలు అందుబాటులో ఉన్నాయి. వుమెన్ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌కు దన్నుగా పూచీకత్తు లేని రుణాలు, వడ్డీపై రాయితీతో కూడిన లోన్లను అందిస్తున్నారు. మరి అవెంటో చూస్తే..
ప్రధాన మంత్రి ముద్ర యోజన పూచీకత్తు లేకుండా వాణిజ్య, తయారీ, సేవా రంగాలకు చెందిన సూక్ష్మ, చిన్న సంస్థలు ఈ పథకం కింద గరిష్ఠంగా రూ.20 లక్షలదాకా రుణాలు పొందవచ్చు. ఇందులో శిశు, కిశోర్, తరుణ్, తరుణ్ ప్లస్ అనే నాలుగు విభాగాలుంటాయి. శిశు కింద రూ.50 వేలదాకా, కిశోర్‌లో రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు, తరుణ్‌లో రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు లోన్లు తీసుకోవచ్చు. ఒకసారి తరుణ్ కేటగిరీలో లోన్ తీసుకుని చెల్లిస్తే.. తరుణ్ ప్లస్ విభాగం కింద మళ్లీ రూ.20 లక్షలదాకా లోన్‌కు అర్హులవుతారు. వడ్డీపైనా రాయితీలుంటాయి.
స్టాండప్ ఇండియా గ్రీన్‌ఫీల్డ్ సంస్థల్ని ప్రారంభించేందుకు మహిళా ఆంత్రప్రెన్యూర్స్‌కు రూ.10 లక్షల నుంచి కోటి రూపాయల మధ్య రుణ సదుపాయం కల్పిస్తారు.
ఉద్యోగిణి గ్రామీణ ప్రాంతాల్లోని మహిళా ఆంత్రప్రెన్యూర్స్‌కు పూచీకత్తు లేకుండా రాయితీ వడ్డీపై రూ.3 లక్షలదాకా రుణాలిస్తారు.
మహిళా ఉద్యమ్ నిధి అనువైన చెల్లింపు పద్ధతుల్లో చిన్నచిన్న వ్యాపారాలను ప్రారంభించేందుకు మహిళలకు ఈ పథకంలో రుణాలుంటాయి.
అన్నపూర్ణ ఫుడ్ క్యాటరింగ్ రంగంలోని మహిళల కోసం ఉద్దేశించిన పథకం.
న్యూ స్వర్ణిమ వెనుకబడిన తరగతులకు చెందిన మహిళల అభ్యున్నతికి తక్కువ వడ్డీకే రూ.2 లక్షలదాకా రుణ సాయం అందుతుంది.
మహిళా సమృద్ధి యోజన 4 శాతం వార్షిక వడ్డీతో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారికి, వెనుకబడిన తరగతి మహిళలకు సూక్ష్మ రుణాలు లభిస్తాయి.
ఎస్బీఐ ద్వారా స్త్రీ శక్తి యోజన, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా సెంట్ కల్యాణి స్కీమ్‌లున్నాయి. చిన్న, సూక్ష్మ వ్యాపారాలకు తక్కువ వడ్డీకే పూచీకత్తు లేని రుణాలు వస్తాయి.
ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తదితర బ్యాంకులూ వివిధ పథకాల ద్వారా మహిళలకు ఆకర్షణీయ వడ్డీరేట్లకే రూ.75 లక్షల నుంచి కోటిదాకా రుణాలిస్తున్నాయి.