తిరుమల : తిరుమల దేవస్థానానికి అశోక్ లేల్యాండ్ (Ashok Leyland ) సంస్థ శుక్రవారం టీటీడీకి రూ.8.75 లక్షలు విలువైన దోస్త్ ప్లస్ ఎక్సెల్ మినీ ట్రక్ ( Mini Truck ) ను విరాళంగా అందించింది.ఈ మేరకు ఆ సంస్థ ఏరియా మేనేజర్ మహ్మద్ నజీరుద్దిన్ శ్రీవారి ఆలయం ఎదుట వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి వాహనం తాళాలను అందజేశారు.
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 31 కంపార్టుమెంట్లు నిండిపోయాయి . టోకెన్లు లేని భక్తులకు 12 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. గురువారం స్వామివారిని 62,642 మంది భక్తులు దర్శించుకోగా 23,887 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల రూ.4.18 కోట్లు ఆదాయం వచ్చిందని వెల్లడించారు.