అర్వపల్లి, ఆగస్టు 06 : అనుమతి కాలం అయిపోయినప్పటికీ అక్రమంగా నిల్వ ఉంచిన భారీ ఇసుక డంప్ ను అధికారులు సీజ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. అర్వపల్లి మండలం జాజిరెడ్డిగూడెం గ్రామంలోని సర్వే నెంబర్ 1257, 1054 భూముల్లో 06-8-2026 నుండి 28-7-2026 వరకు మాత్రమే పరిమితి ఉండగా ఇష్టానుసారంగా గుట్టలు గుట్టలుగా ఇసుకను నిల్వ చేశారు. దీంతో గురువారం జిల్లా మైనింగ్, రెవిన్యూ అధికారులు పరిశీలించి గ్రామస్తుల సమక్షంలో 140 టిప్పులు కలిగిన ఇసుక డంప్ ను సీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ మైనింగ్ అధికారి రఘు బాబు, సూపరింటెండెంట్ విజయరామరాజు, తాసీల్దార్ శ్రీకాంత్, ప్రాజెక్టు మేనేజర్ కిరణ్ కుమార్, కార్యదర్శి పాల్గొన్నారు.