న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) ప్రకటించిన దేశీయ రెండో అతిపెద్ద ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)కు మదుపర్ల నుంచి విశేష స్పందన లభించింది. సోమవారంతో ఈ పబ్లిక్ ఇష్యూ ముగియగా.. బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) వివరాల ప్రకారం 5.71 రెట్లు అధికంగా బిడ్లు దాఖలయ్యాయి. రూ.22,569 కోట్లకుగాను రూ.90, 300 కోట్ల విలువైన బిడ్లు వచ్చాయి.
8.86 కోట్ల షేర్లను కంపెనీ ఆఫర్‌కు పెట్టగా.. 50.58 కోట్ల షేర్లకు సరిపడా బిడ్డింగ్ నమోదైంది. సంస్థాగత మదుపర్ల నుంచి డిమాండ్ ఎక్కువగా కనిపించింది. రిటైల్ ఇన్వెస్టర్లు 1.39 రెట్లు అధికంగా బిడ్లు వేశారు. గురువారం ఈ షేర్లు బీఎస్ఈలో లిస్టింగ్ అయ్యే వీలున్నది. కాగా, దేశీయ స్టాక్ మార్కెట్లలో హ్యుందాయ్ (రూ.27,870 కోట్లు) తర్వాత అతిపెద్ద ఐపీవో ఎన్ఎస్ఈదే. గతంలో ఎల్ఐసీ (రూ. 21,000 కోట్లు) ఉండేది.