డీఎస్పీల ప్రమోషన్లకు లైన్ క్లియర్
తెలంగాణ పోలీసు శాఖలో పెండింగ్‌లో ఉన్న డీఎస్పీల ఉద్యోగోన్నతుల ప్రక్రియకు ఎట్టకేలకు మార్గం సుగమమవుతున్నది. సీనియారిటీ వివాదాలు, రిజర్వేషన్ ఆఫ్ రోస్టర్ (ఆర్వోఆర్), కోర్టు కేసుల కారణంగా నిలిచిపోయిన ప్రమోషన్ల వ్యవహారాన్ని పరిషరించేందుకు డీజీపీ సీవీ ఆనంద్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు.
హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ పోలీసు శాఖలో పెండింగ్‌లో ఉన్న డీఎస్పీల ఉద్యోగోన్నతుల ప్రక్రియకు ఎట్టకేలకు మార్గం సుగమమవుతున్నది. సీనియారిటీ వివాదాలు, రిజర్వేషన్ ఆఫ్ రోస్టర్ (ఆర్వోఆర్), కోర్టు కేసుల కారణంగా నిలిచిపోయిన ప్రమోషన్ల వ్యవహారాన్ని పరిషరించేందుకు డీజీపీ సీవీ ఆనంద్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. మంగళవారం డీజీపీ కార్యాలయంలో 1991, 1995, 1996 బ్యాచ్‌లకు చెందిన సివిల్ ఎస్ఐలతో ఆయన సమావేశమయ్యారు.
సీనియారిటీ, రోస్టర్ పాయింట్లు, ఖాళీలు, ఉద్యోగోన్నతులకు అర్హత వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. తొలి విడతలో మొత్తం 54 అదనపు ఎస్పీ పోస్టులు అందుబాటులో ఉన్నట్టు వెల్లడించారు. రెండో విడతలో మరో 34 పోస్టులు అందుబాటులోకి రానున్నాయి. 1991, 1995, 1996 బ్యాచ్‌ల అధికారుల ప్రమోషన్ ప్యానళ్లను ఇప్పటికే సిద్ధం చేశారు. ప్రస్తుతం ఎలాంటి కోర్టు కేసులు, వివాదాలు లేని 12 ఎస్పీ (నాన్ క్యాడర్) పోస్టులను తక్షణమే భర్తీ చేసే అవకాశమున్నట్టు వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

