చెల్లెళ్లకు భర్తలు లేకున్నా పర్వాలేదు.. కాంగ్రెస్ ఉంటే చాలు
‘కొంతమంది చెల్లెళ్లకు భర్తలు లేకున్నా పర్వాలేదు. కాంగ్రెస్ పార్టీ ఉంటే చాలు’ అని మహబూబాబాద్ ఎం పీ బలరాంనాయక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మహబూబాబాద్ జిల్లా గూడూరులో రాజ్యసభ సభ్యుడు, సీఎం సలహాదారుడు వేంనరేందర్రెడ్డితో కలిసి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన సభలో బలరాంనాయక్ మాట్లాడుతూ.. ‘కొంతమంది చెల్లెళ్లకు భర్తలు లేకున్నా పర్వాలేదు.
- ఎంపీ బలరాంనాయక్ వివాదాస్పద వ్యాఖ్యలు
గూడూరు, నవంబర్17: ‘కొంతమంది చెల్లెళ్లకు భర్తలు లేకున్నా పర్వాలేదు. కాంగ్రెస్ పార్టీ ఉంటే చాలు’ అని మహబూబాబాద్ ఎం పీ బలరాంనాయక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మహబూబాబాద్ జిల్లా గూడూరులో రాజ్యసభ సభ్యుడు, సీఎం సలహాదారుడు వేంనరేందర్రెడ్డితో కలిసి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన సభలో బలరాంనాయక్ మాట్లాడుతూ.. ‘కొంతమంది చెల్లెళ్లకు భర్తలు లేకున్నా పర్వాలేదు. కాంగ్రెస్ పార్టీ ఉంటే చాలు, కాంగ్రెస్ పార్టీ ఉంటే వృద్ధాప్య పింఛన్ వస్తుంది, బియ్యం వస్తుంది, ఇందిరమ్మ ఇల్లు వస్తుంది, కరెంట్ ఫ్రీ’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై మహిళలు స్పందిస్తూ.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చే పథకాలకు తమ భర్తలు చనిపోవాలా? తమ ఐదోతనం పోగొట్టుకోవాలా? అని మండిపడుతున్నారు.
నా మాటలు వక్రీకరించారు : బలరాంనాయక్
తన మాటలను కొందరు వక్రీకరించారని ఎంపీ బలరాంనాయక్ వివరణ ఇచ్చారు. గిరిజనులకు తెలుగులో అర్థమయ్యేలా భర్తను కోల్పోయిన అక్కాచెల్లెళ్లకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని మాత్రమే చెప్పానని స్పష్టంచేశారు. తాను ఇతర ఉద్దేశంతో మాట్లాడలేద ని, కొందరు కావాలనే తన వ్యాఖ్యలను వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. తన మాటల వల్ల ఎవరైనా బాధపడి ఉంటే క్షమించాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

