బెంగళూరులో మరో ‘సర్’ వివాదం!
కర్ణాటకలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సమీక్ష(సర్) ప్రక్రియపై మరో వివాదం తెరపైకి వచ్చింది. బెంగళూరులో తుది ఓటర్ల జాబితాలో కొత్తగా చేరిన 1,13,059 మంది ఓటర్లకు సంబంధించిన దరఖాస్తుల వివరాలు అందుబాటులో లేవని ‘ది హిందూ’ పరిశీలనలో వెల్లడైంది.
- 1.13 లక్షల కొత్త ఓటర్ల దరఖాస్తుల వివరాలు గల్లంతు!
బెంగళూరు, నవంబర్ 17: కర్ణాటకలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సమీక్ష(సర్) ప్రక్రియపై మరో వివాదం తెరపైకి వచ్చింది. బెంగళూరులో తుది ఓటర్ల జాబితాలో కొత్తగా చేరిన 1,13,059 మంది ఓటర్లకు సంబంధించిన దరఖాస్తుల వివరాలు అందుబాటులో లేవని ‘ది హిందూ’ పరిశీలనలో వెల్లడైంది. మొత్తం కొత్తగా నమోదైన 2,55,926 మంది ఓటర్లలో దాదాపు 44 శాతం మందికి సంబంధించిన దరఖాస్తులను అధికారిక రికార్డులతో సరిపోల్చలేకపోయారు. అంటే కొత్తగా చేరిన ప్రతి ఇద్దరిలో దాదాపు ఒకరి దరఖాస్తు వివరాలు గుర్తించలేని పరిస్థితి నెలకొంది. బెంగళూరులోని 28 అసెంబ్లీ నియోజకవర్గాల తుది ఓటర్ల జాబితాలను పరిశీలించినప్పుడు ఈ వ్యత్యాసం బయటపడింది.
కొత్త ఓటర్ల నమోదుకు ఉపయోగించే ఫామ్-6, ఇప్పటికే ఓటర్లుగా నమోదైన వారి పోలింగ్ కేంద్రం లేదా నియోజకవర్గ మార్పులకు ఉపయోగించే ఫామ్-8 దరఖాస్తుల వివరాలతో తుది జాబితాలోని పేర్లను సరిపోల్చగా 1.13 లక్షల మంది వివరాలు లభించలేదుఅన్ని దరఖాస్తులూ ఉన్నాయి: ఈసీ
ఈ వ్యవహారంపై కర్ణాటక ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం స్పందించింది. ఫామ్-6కు సంబంధించిన అన్ని దరఖాస్తులూ తమ వద్ద ఉన్నాయని స్పష్టం చేసింది. అయితే ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 23 వరకు కొనసాగిన క్లెయిమ్‌లు, అభ్యంతరాల గడువు వెలుపల దాఖలైన కొన్ని దరఖాస్తులు ఫామ్-9 నివేదికల్లో కనిపించకపోవచ్చని వివరించింది. ఫామ్-9 నివేదికలను క్లెయిమ్‌లు, అభ్యంతరాల గడువు సమయంలో మాత్రమే అందుబాటులో ఉంచామని అధికారులు తెలిపారు. అయితే గడువు ముగిసిన తర్వాత కూడా సీఈవో వెబ్సైట్లో సమగ్ర ఫామ్-9 నివేదికలు అందుబాటులో ఉన్నాయని ‘ది హిందూ’ పేర్కొంది.
సర్‌తో భారీగా తగ్గిన ఓటర్ల సంఖ్య
కర్ణాటకలో సర్ ప్రక్రియ ప్రారంభానికి ముందు జూన్ 16 నాటికి బెంగళూరులో 1.03 కోట్ల మంది ఓటర్లు ఉండగా, అక్టోబర్ 27న విడుదలైన తుది జాబితాలో ఆ సంఖ్య సుమారు 59.08 లక్షలకు తగ్గింది. ఈ నేపథ్యంలో రికార్డుల్లో బయటపడిన వ్యత్యాసాలు ఎన్నికల జాబితాల పారదర్శకతపై మరోసారి చర్చకు దారితీశాయి. అయితే దరఖాస్తుల వివరాలు ప్రచురిత నివేదికల్లో కనిపించకపోవడం మాత్రమే ఆ ఓటర్ల నమోదులు అక్రమమని నిర్ధారించదు. ఎన్నికల అధికారుల వద్ద ఉన్న అస లు దరఖాస్తులను పరిశీలించి, ప్రతి నమోదును ధ్రువీకరించాల్సిన అవసరం ఉంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

