ముంబై, సెప్టెంబర్ 21: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగోరోజూ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు తగ్గుముఖం పట్టడం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగానిధులు కుమ్మరించడంతోపాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు మదుపర్లను కొనుగోళ్ల వైపు నడిపించాయి. ఇంట్రాడేలో 700 పాయింట్ల వరకు లాభపడిన సెన్సెక్స్ వారం గరిష్ఠ స్థాయికి చేరుకున్నది. చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 564.03 పాయింట్లు అందుకొని 74,858.99 వద్ద స్థిరపడింది.
మరో సూచీ ఎన్ఎస్ఈ నిఫ్టీ 67.90 పాయిం ట్లు అందుకొని 23,414.30 వద్ద నిలిచింది. అల్ట్రాటెక్ సిమెంట్ షేరు 4 శాతానికి పైగా ఎగబాకి టాప్ గెయినర్‌గా నిలిచింది. దీంతోపాటు హెచ్‌సీఎల్ టెక్నాలజీ, నెస్లె, రెడ్డీస్, ఎటర్నల్, టైటాన్ షేర్లు రెండు శాతానికి పైగా బలపడ్డాయి.అలాగే అపోలో హాస్పిటల్స్, ఐటీసీ, టెక్ మహీం ద్రా, సన్‌ఫార్మా, ఏషియన్ పెయింట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టీసీఎస్, హిందా ల్కో, ట్రెంట్, ఓఎన్జీసీ, ఎల్అండ్టీ, బీఈఎల్, రిలయన్స్, శ్రీరామ్‌ఫైనాన్స్ షేర్లు ఒక్క శాతానికి పైగా ఎగబాకాయి. కానీ, ఎయిర్టెల్, పవర్‌గ్రిడ్, ఇన్ఫోసిస్, టీఎంపీవీ, అదానీపోర్ట్స్, విప్రో, టాటా స్టీల్, జియో ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్, టీవీఎస్ మోటర్ షేర్లు పతనం చెందాయి.