Tamanna Simhadri | ఎట్టకేలకి తన భర్తని పరిచయం చేసిన ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి .. పోస్ట్ వైరల్
Tamanna Simhadri | తెలుగు బిగ్‌బాస్ సీజన్-3 కంటెస్టెంట్‌గా గుర్తింపు తెచ్చుకున్న తమన్నా సింహాద్రి తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ముఖ్యమైన విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఏడాది క్రితమే తనకు వివాహం జరిగిందని వెల్లడిస్తూ, మొదటి వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని భర్తతో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Tamanna Simhadri | తెలుగు బిగ్‌బాస్ సీజన్-3 కంటెస్టెంట్‌గా గుర్తింపు తెచ్చుకున్న తమన్నా సింహాద్రి తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ముఖ్యమైన విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఏడాది క్రితమే తనకు వివాహం జరిగిందని వెల్లడిస్తూ, మొదటి వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని భర్తతో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ పోస్టులు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. విజయవాడకు చెందిన తమన్నా అసలు పేరు మస్తాన్. చిన్ననాటి నుంచి ఎదుర్కొన్న సవాళ్లను అధిగమిస్తూ, తన అసలైన వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించుకునే ప్రయాణంలో భాగంగా ముంబైలో లింగ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆ తర్వాత తమన్నా సింహాద్రిగా కొత్త జీవితం ప్రారంభించారు. ఆమె జీవన ప్రయాణం ఎంతో మందికి ప్రేరణగా నిలిచింది.
బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న సమయంలో శ్రీముఖితో ఏర్పడిన స్నేహం ఇప్పటికీ కొనసాగుతోందని తమన్నా వెల్లడించారు. కుటుంబ సభ్యులు దూరంగా ఉన్న సమయంలో శ్రీముఖి తనకు అండగా నిలిచిందని, కుటుంబ సభ్యురాలిలా ఆదరించిందని ఆమె భావోద్వేగంగా పేర్కొన్నారు. ఇక రాజకీయాలపైనా తమన్నాకు ఆసక్తి ఉంది. గతంలో మంగళగిరిలో నారా లోకేష్‌పై, పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌పై పోటీ చేసి వార్తల్లో నిలిచారు. తనదైన స్టైల్లో ఎప్పుడూ సంచలనంగా నిలిచే తమన్నా, ఇప్పుడు తన వ్యక్తిగత జీవితం ద్వారా మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు.
అయితే తన భర్త పేరు, ఇతర వ్యక్తిగత వివరాలను మాత్రం ఆమె గోప్యంగా ఉంచారు. సొంత ఊరిలో కుటుంబ సభ్యులతో కలిసి ఈ ప్రత్యేక రోజును జరుపుకున్న ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. తల్లి కోరిక మేరకు అమ్మాయిగా మారి, జీవితాన్ని కొత్తగా ప్రారంభించిన తమన్నా సింహాద్రి.. ఇప్పుడు వివాహ జీవితం కూడా సంతోషంగా సాగిస్తుండటంతో, అభిమానులు మరియు సహచర బిగ్‌బాస్ కంటెస్టెంట్లు ఆమెకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

