పోలవరం నుంచి జీసీ లింక్ ఇవ్వండి
గోదావరి-కావేరి నదుల అనుసంధానంలో నీటి తరలింపు సోర్స్‌ను ఇచ్చంపల్లి నుంచి పోలవరానికి మార్చాలని ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించింది. పోలవరం-బనకచర్ల లింక్‌ను అనుసంధానించి నీటిని తరలించాలని కోరింది.
- ఎన్‌డబ్ల్యూడీఏలో ఏపీ ప్రతిపాదన
- తమ ప్రాంతాలు మునిగిపోతాయని తెలంగాణ అభ్యంతరం
హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ) : గోదావరి-కావేరి నదుల అనుసంధానంలో నీటి తరలింపు సోర్స్‌ను ఇచ్చంపల్లి నుంచి పోలవరానికి మార్చాలని ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించింది. పోలవరం-బనకచర్ల లింక్‌ను అనుసంధానించి నీటిని తరలించాలని కోరింది. అయితే, ఈ ప్రతిపాదనను తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకించింది. పోలవరం నుంచి నీటిని తరలిస్తే బ్యాక్ వాటర్‌తో తెలంగాణలోని పలు ప్రాంతాలు ముంపునకు గురవుతాయని, ఇది తమకు ఆమోదయోగ్యం కాదని స్పష్టంచేసింది.
ఈ నెల 3న జరిగిన ఎన్ డబ్ల్యూడీఏ 77వ గవర్నింగ్ బాడీ సమావేశం మినిట్స్‌ను శుక్రవారం విడుదల చేశారు. జీ-సీ లింక్‌లో ఇంద్రావతి సబ్ బేసిన్ నీటి తరలింపుపై ఏపీ అభ్యంతరం తెలిపింది. ఆల్మట్టి నుంచి రీప్లేస్మెంట్ పద్ధతిలో కర్ణాటకకు 16 టీఎంసీలు కేటాయించాలన్న ప్రతిపాదనను పునఃసమీక్షించాలని, దీనివల్ల జూరాలకు నీటి ప్రవాహం తగ్గుతుందని తెలంగాణ ఆందోళన వ్యక్తం చేసింది.
కృష్ణా బేసిన్లో పెరిగే అదనపు జలాల్లో తెలంగాణకు వాటా ఇవ్వాలని డిమాండ్ చేసింది. బేడ్తి-హిరేవడ్డతి లింక్‌పై కృష్ణా వాటర్ బ్యాలెన్స్ స్టడీ వివరాలు ఇవ్వాలని ఏపీ కోరింది. అఘనాశిని-వేదావతి ఇంట్రా స్టేట్ లింక్‌ను జాతీయ ప్రణాళికలో చేర్చాలని కర్ణాటక ప్రతిపాదించింది. ప్రాజెక్టుల డీపీఆర్‌లలో జాప్యంపై ఎన్‌డబ్ల్యూడీఏ చైర్మన్ అసంతృప్తి వ్యక్తంచేశారు. సంబంధిత ఆరు రాష్ట్రాలతో విడివిడిగా సమావేశాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

