ఏది మంచో చెడో వివరించాలి.. పెద్దల నిర్ణయాలను పిల్లలపై రుద్దడం మానేయాలి!
టీనేజర్లకు కాస్త ప్రైవసీ అవసరమని గుర్తించాలి. వారి పర్సనల్ డైరీలు చదవడం, రహస్యంగా ఫోన్లు చెక్ చేయడం వంటివి చేస్తే వారిలో మీపై నమ్మకం పోతుంది. ఏది మంచో, ఏది చెడో హేతుబద్ధంగా వివరించాలి. పెద్దల నిర్ణయాలను పిల్లలపై బలవంతంగా రుద్దడం మానేయాలి.
ఇన్ఫోగ్రాఫిక్
అసలు రహస్యం తెలుసుకోండి!
చిన్నారులు ముద్దుముద్దుగా చెప్పే అబద్ధాలకు కూడా తల్లిదండ్రులు మురిసిపోతారు. ఇంట్లో గాజు వస్తువును పగలగొట్టినా, పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చినా.. తమ తప్పేం లేదని బుకాయిస్తారు పిల్లలు. కానీ, వయసు పెరుగుతున్న కొద్దీ ప్రతిచిన్న విషయాన్నీ పెద్దవాళ్లతో పంచుకోవడం అలవాటు చేసుకుంటారు. అలాంటి పిల్లలు.. టీనేజ్‌లోకి రాగానే, ‘రహస్యాలను దాచడం’ మొదలుపెడతారు. గది తలుపులు వేసుకోవడం, మొబైల్ ఫోన్లకు పాస్వర్డ్లు పెట్టుకోవడం.. లాంటివి చేస్తుంటారు. అయితే, టీనేజర్లు ఇలా ‘సీక్రెట్ కీపర్స్’గా మారడానికి అనేక కారణాలు ఉంటాయని మానసిక నిపుణులు చెబుతున్నారు.
కొందరు తల్లిదండ్రులు పిల్లలకు సంబంధించిన ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకుంటారు. పిల్లల ప్రతి అడుగునూ గమనిస్తూ, వాళ్ల స్వేచ్ఛను హరించేలా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి తల్లిదండ్రుల దగ్గర పిల్లలు ఎక్కువగా విషయాలు దాస్తారు. తమపై నమ్మకం లేదనే భావన పిల్లల్లో పెరిగి, రహస్య జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు.

Parenting
రోజంతా ఆఫీస్ పనులు, బిజీ లైఫ్ వల్ల పిల్లలతో కూర్చుని కాసేపు మాట్లాడటానికి కూడా తల్లిదండ్రులు సమయం కేటాయించలేక పోతున్నారు. పిల్లలు తమ మనసులోని మాటను చెప్పడానికి ప్రయత్నించినప్పుడు, ‘నాకిప్పుడు తీరిక లేదు’ అని విసుక్కుంటే.. పిల్లలు ఇక ఎప్పటికీ తమకు సంబంధించిన విషయాలు చెప్పడానికి ముందుకు రారు.
వయసుతోపాటే పిల్లల్లో వ్యక్తిగత అభిప్రాయాలు, ఆలోచనలు కూడా మారుతుంటాయి. తమకంటూ ఒక ప్రత్యేక ప్రపంచం ఉండాలని కోరుకుంటారు. స్నేహితుల మధ్య జరిగే కబుర్లు, ఇష్టాయిష్టాలు, కొన్నిసార్లు టీనేజ్ ఆకర్షణలు వంటివి తల్లిదండ్రులతో పంచుకోవడానికి మొహమాటపడతారు.
పిల్లలు ఏ చిన్న తప్పు చేసినా.. కొందరు తల్లిదండ్రులు వెంటనే కోప్పడతారు. పెద్ద రాద్ధాంతం చేస్తారు. ఇలాంటి పేరెంట్స్‌కు సహజంగానే పిల్లలు భయపడతారు. ‘ఈ విషయం తెలిస్తే అమ్మానాన్న తిడతారు. లేదంటే నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారు’ అనే భయంతోనే.. వాళ్లు విషయాలను దాచడం మొదలుపెడతారు.

Secret Keeper
అనేక నష్టాలు..
ఇలా.. పిల్లలు ప్రతి విషయాన్నీ తమలోనే దాచుకోవడం అలవాటు చేసుకుంటే, అది వారి మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. తమ సమస్యలను ఎవరితోనూ పంచుకోలేక లోలోపలే కుమిలిపోతారు. క్రమంగా డిప్రెషన్లోకి కూరుకుపోతారు. అంతేకాకుండా, మంచి-చెడు విచక్షణ సరిగ్గా లేని వయసులో, సీక్రెట్లు దాచే క్రమంలో పిల్లలు చెడు అలవాట్లకు బానిసయ్యే ప్రమాదం కూడా ఉంటుంది.
జాగ్రత్త సుమీ..
పిల్లలకు కేవలం తల్లిదండ్రులుగానే కాకుండా మంచి స్నేహితులుగా ఉండాలి. వాళ్లు ఏ తప్పు చేసినా భయపడకుండా వచ్చి మీతో చెప్పుకొనే ధైర్యాన్ని ఇవ్వాలి. పిల్లలు ఏదైనా చెబుతున్నప్పుడు మధ్యలో ఆపకుండా, విసుక్కోకుండా పూర్తిగా ఆలకించాలి. వారి భావాలను గౌరవించాలి. ఇక టీనేజర్లకు కాస్త ప్రైవసీ అవసరమని గుర్తించాలి. వారి పర్సనల్ డైరీలు చదవడం, రహస్యంగా ఫోన్లు చెక్ చేయడం వంటివి చేస్తే వారిలో మీపై నమ్మకం పోతుంది. ఏది మంచో, ఏది చెడో హేతుబద్ధంగా వివరించాలి. పెద్దల నిర్ణయాలను పిల్లలపై బలవంతంగా రుద్దడం మానేయాలి.

Infogarphic
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

