MLA Manik Rao | హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం : ఎమ్మెల్యే మాణిక్ రావు
MLA Manik Rao | హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు అన్నారు.
జహీరాబాద్ : హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు ( MLA Manik Rao ) అన్నారు. శుక్రవారం జహీరాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పార్టీ మండల అధ్యక్షులు తట్టు నారాయణ ఆధ్వర్యంలో జహీరాబాద్ మండలంలోని మధులై తాండా గ్రామ పంచాయతీకి చెందిన పలువురు బీఆర్ఎస్( BRS ) లో చేరారు.
డిప్యూటీ సర్పంచ్ ప్రేమ్ రాథోడ్, నాయకులు జై సింగ్, రవి, ఏక్నాథ్, సంతోష్, కృష్ణ, జైపాల్, ధనరాజ్, నాగేందర్, రాజు, పృథ్వీ, వెంకట్ , మనోజ్ తదితరులు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్( Congress ) నుంచి బీఆర్ఎస్ పార్టీ లో చేరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో అడ్డగోలు హామీలు ఇచ్చిందని ఆరోపించారు.
వంద రోజుల్లోనే అమలు చేస్తామని ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకొని గద్దె నెక్కి ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలయ్యే వరకూ ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ప్రభుత్వంలో తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా మార్చి సాగు తాగు నీరు అందించి వ్యవసాయాన్ని సస్యశ్యామలం చేసిన ఘనత కేసిఆర్‌కే దక్కిందన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు హీరూ రాథోడ్, బీసీ సెల్ మండల అధ్యక్షులు అమిత్ కుమార్, మైనారిటీ సెల్ అధ్యక్షులు వహీద్ అలీ, నాయకులు చిన్న రెడ్డి, జగదీశ్ పర్వేజ్ పటేల్,రాజు,గులాబ్ సింగ్ ,సీనియర్ గ్రామ నాయకులు పుండ్లీక్ పవార్,దేవిదాస్,పవన్ రాథోడ్ , మేఘునాథ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srilanka Cricket | ముక్కోణపు వన్డేలకు ఓపెనర్ దూరం.. అన్క్యాప్డ్ కుర్రాడికి భలే అవకాశం..!
ఆపన్నుడికి లయన్స్ క్లబ్ నోబుల్ ఆపన్నహస్తం
Maharashtra | రోడ్లపై, బహిరంగ ప్రదేశాలలో టపాసులు కాల్చడంపై మహారాష్ట్రలో నిషేధం.. బాంబే హైకోర్టు ఆదేశం
Sarpanches | విద్యుత్ సిబ్బంది కనీసం ఫోన్లు కూడా ఎత్తడం లేదు.. కరెంట్ కష్టాలపై సర్పంచ్‌లు
Bathukamma Celebrations | కుభీర్‌లో ఘనంగా కొనసాగుతున్న బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

