వేములవాడ : కల్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్ పథరాలపే ఎత్తి వేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రకు నిరసనగా బీఆర్ఎస్ శ్రేణులు వేములవాడ పట్టణంలో సోమవారం ధర్నా నిర్వహించారు. బీఆర్ఎస్ ( BRS ) నాయకులు పట్టణంలోని తెలంగాణ చౌక్ నుంచి ర్యాలీగా వెళ్లి వేములవాడ ( Vemulawada ) తహసీల్ కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు.

బీఆర్ఎస్ మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి కి మహిళల ఉసురు తగులుతుందని హెచ్చరించారు. మహిళలకు ఇస్తామన్న రూ.2,500 నగదును ఇప్పటికే మంగళం పాడారని ఎద్దేవా చేశారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పై హైకోర్టు స్టే ఇవ్వడంపై కౌంటర్ ఫైల్ దాఖలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తుందని మండిపడ్డారు. అనంతరం వేములవాడ తహసీల్దార్ జయంత్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు జ్యోతి, అనిత, లావణ్య, వెంగళ అనిత, నాయకులు రామతీర్థపు రాజు, ఏనుగు తిరుపతిరెడ్డి, నిమ్మశెట్టి విజయ్, సిరిగిరి రామచందర్, వెంగళ శ్రీకాంత్, వాసాల శ్రీనివాస్, మారం కుమార్, గూడూరు మధు, మారం కుమార్, కొండ నరసయ్య, రాజు, రేగుల రాజేశం, మల్లేశం, సంజీవ్, కనకరాజు యాదవ్, శివ, సుంకపాక రాజు, సత్యనారాయణ రెడ్డి, రాధా కిషన్ రావు, సందీప్, సంజీవ్ తదితరులు ఉన్నారు.