సైదాబాద్, మార్చి 8 : జీవిత చరమాంకంలో ఉన్న శతాధిక వృద్ధ్దుడు 50 ఎకరాలు కలిగిన భూస్వామి..స్వాతంత్య్ర సమరయోధుడు.. రజాకార్ల వ్యతిరేక ఉద్యమం, తెలంగాణ తొలిదశ ఉద్యమంలో పోరాడిన అనుభవం అతనిది… అయితే జీవిత చరమాంకంలో కుమారులు పట్టించుకోకపోవడంతో ఆకలితో అల్లాడుతూ వీధి పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. యాదాద్రి -భవనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని కేశిపల్లి గ్రామానికి చెందిన ఉంగరాల యాదగిరి (110)కు నలుగురు కుమారులు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. 30 ఏండ్ల క్రితమే తనకు ఉన్న 50 ఎకరాల భూమిని నలుగురు కొడుకులకు ఒక్కొక్కరికి 10 ఎకరాల చొప్పున, ఇద్దరు కూతుళ్లకు 5 ఎకరాల చొప్పున పంచి ఇచ్చాడు.
భూమి ఇవ్వడమే కాకుండా తన కుమారులు ఇండ్లు కట్టుకోవడానికి ఆర్థిక సహాయం కూడా చేశా డు. ఆయన భార్య లక్ష్మమ్మ ఎనిమిది ఏండ్ల క్రితం చనిపోయింది. అయితే.. వృద్ధుడైన యాదగిరిని కుమారులు పట్టించుకోవడం మానేశారు. అంతే కాకుండా తీవ్రంగా దుషి స్తూ కొట్టడమే కాకుండా వేధింపులకు గురిచేస్తున్నారు. వృద్ధాప్యంలో మనసుచావక కన్న కొడుకుల ఇంటికి వెళ్తే ఇంకా బతికున్నావా… అంటూ హేళనతో దూషిస్తూ, తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తున్నారని వాపోయాడు.
దీం తో కూతుళ్లు, కొందరు బంధువుల సహాయం తో కొంతకాలంగా బోడుప్పల్‌లోని ఓ వృద్ధాశ్రామంలో ఉంటున్నాడు. వేధింపులకు గురిచేస్తున్న కొడుకులపై తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారులకు విజ్ఞప్తి చేసి నా పట్టించుకోవడడం లేదని యాదగిరి వా పోతున్నారు. ప్రభుత్వం తన బాధను అర్థం చేసుకొని తగిన న్యాయం చేయాలని కోరుతున్నారు. తన కుమారులకు పంచి ఇచ్చిన భూ మి తిరిగి తనకు ఇప్పించి న్యాయం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరుతున్నాడు.