Sabitha Indra Reddy | ఇంజినీరింగ్ విద్యార్థులకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి : సబితా ఇంద్రారెడ్డి డిమాండ్
Sabitha Indra Reddy | ఇంజినీరింగ్ విద్యార్థులను ‘ క్రిమినల్ వేస్ట్’ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యనించడాన్ని బీఆర్ఎస్ పార్టీ శాసన సభాపక్షం ఉపనాయకురాలు పి.సబితా ఇంద్రారెడ్డి ఖండించారు.
హైదరాబాద్ : తెలంగాణ నవనిర్మాతలైన ఇంజినీరింగ్ విద్యార్థులను ( Engineering Students ) ‘ క్రిమినల్ వేస్ట్’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy ) వ్యాఖ్యనించడాన్ని బీఆర్ఎస్ పార్టీ శాసన సభాపక్షం ఉపనాయకురాలు పి.సబితా ఇంద్రారెడ్డి ( Sabitha Indra Reddy ) తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి తెలంగాణ విద్యార్థి లోకానికి బహిరంగంగా భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇంజినీరింగ్ విద్యార్థులపై నోరుపారేసుకోవడం ముఖ్యమంత్రి అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. భావి భారత నవనిర్మాతలను అభినందించాల్సింది పోయి, ఇష్టారాజ్యంగా అభాండాలు వేయడం రేవంత్ రెడ్డి అజ్ఞానానికి పరిపాటిగా మారిందని ఆరోపించారు.
తన పాలనా వైఫల్యాన్ని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించలేని, చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికే రేవంత్ రెడ్డి పవిత్రమైన విద్యావ్యవస్థపై బురద జల్లుతూ విద్యార్థులపై ‘ క్రిమినల్స్ ’అనే ముద్ర వేస్తున్నారని విమర్శించారు. ప్రపంచస్థాయి జ్ఞానులను, శాస్త్రవేత్తలను అందించిన తెలంగాణ గడ్డపై చదువు కుంటున్న విద్యార్థుల మనోధైర్యాన్ని దెబ్బతీసే హక్కు ఏ పాలకుడికీ లేదని సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

