Ashwin : వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ కంటే ముందు చీఫ్ సెలెక్టర్‌గా సేవలందిస్తున్న అజిత్ అగార్కర్(Ajit Agarkar) పదవీకాలం ముగియనుంది. సెప్టెంబర్‌తో అగార్కర్ కాలపరిమితి పూర్తి కానున్నందున తదుపరి ప్రధాన సెలెక్టర్ ఎవరు? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అశావహులు చాలామందే ఉన్నప్పటికీ మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) రేసులో అందరికంటే ముందున్నాడనే కథనాలు వస్తున్నాయి. బీసీసీఐ కూడా అగార్కర్ స్థానంలో మాజీ ఆఫ్ స్పిన్నరైన యశ్‌కు బాధ్యతలు అప్పగించనుందనే వార్తలు నెట్టింట వైరలవుతున్నాయి.
సీనియర్లను పక్కన పెట్టేసి.. కుర్రాళ్లకు పెద్దపీట వేయడంతో పాటు స్క్వాడ్ ఎంపిక కూడా అస్సలు బాగుండడం లేదనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్. ఇటీవల ఐర్లాండ్, ఇంగ్లండ్ గడ్డపై టీ20 సిరీస్ ఓటమితో హెడ్‌కోచ్ గౌతం గంభీర్, ప్రధాన సెలెక్టర్ అగార్కర్ పనితీరపై విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో, పదవీకాలం ముగింపు దశలో ఉన్న గవార్కర్ను పొడిగిస్తారా? లేదా? అనేదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇదిలా ఉండగా.. అప్పుడే అగార్కర్ వారసుడు ఎవరు? అనే చర్చ మొదలైంది.
🚨 ANNOUNCEMENT 🚨
Ravichandran Ashwin is set to be appointed as Team India’s new Chief Selector ahead of the 2027 ODI World Cup. pic.twitter.com/C2chcNP1P5
— Indian cricket (@Cricketpaglu45) July 30, 2026
ఎందుకంటే.. మరో నెల రోజుల్లో(సెప్టెంబర్) చీఫ్ సెలెక్టర్‌గా అగార్కర్ పదవీకాలం ముగియనుంది. దాంతో, కాబోయే ప్రధాన సెలెక్టర్ ఎవరు? పోటీలో ఎవరెవరు ఉన్నారు? అనేది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. అగార్కర్ అనంతరం మాజీ ఆటగాడు రవించంద్రన్ అశ్విన్ ప్రధాన సెలెక్టర్ పదవిని చేపట్టే అవకాశముందనే వార్తలు వినిపిస్తున్నాయి.
వచ్చే వన్డే ప్రపంచకప్ 2027 ముందే అశ్విన్ నియామకం జరుగుతుందని ఆన్లైన్లో కథనాలు వస్తున్నాయి. దాంతో.. ఒక్కసారిగా అశ్విన్ ఎక్స్‌లో ట్రెండ్ అవుతున్నాడు. రిటైర్మెంట్ అనంతరం సొంత యూట్యూబ్ ఛానెల్లో క్రికెట్ విశ్లేషణలు చేస్తున్న స్పిన్ దిగ్గజం మాత్రం ఈ వైరల్ వార్తలపై స్పందించలేదు. బీసీసీఐ సైతం అగార్కర్ మార్పుపై ఎలాంటి ప్రకటన ఇంకా చేయలేదు.
🚨 New Chief Selector for Team India 🚨
Ajit Agarkar’s tenure as Team India’s Chief Selector will come to an end in September.
The BCCI is expected to appoint a new Chief Selector, and former India off-spinner Ravichandran Ashwin has reportedly emerged as one of the leading… pic.twitter.com/vJVZ7L1hzL— Central Cricket (@arshdeep3444) July 29, 2026