జైపూర్: ఆర్మీ అధికారులు ప్రయాణించిన ఎస్యూవీ వాహనం ఒక ఒంటెను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ వాహనం పల్టీలుకొట్టింది. ఆర్మీ మేజర్ మరణించగా ఇద్దరు ఆర్మీ అధికారులు తీవ్రంగా గాయపడ్డారు. (Army Major Killed) రాజస్థాన్‌లోని జైసల్మేర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున 12.30 గంటల సమయంలో ఆర్మీ మేజర్ హంజా ఆరిఫ్, డ్యూటీ ముగిసిన తర్వాత ఇద్దరు తోటి అధికారులతో కలిసి ఎస్‌యూవీలో ఆర్మీ స్టేషన్‌కు వెళ్తున్నారు. ఉన్నట్టుండి రోడ్డుపైకి ఒక ఒంటె రావడంతో ఆ వాహనం బలంగా దానిని ఢీకొట్టింది. ఆర్మీ వాహనం బోల్తాకొట్టి పలుమార్లు పల్టీలు కొట్టింది.
కాగా, ఈ సమాచారం తెలిసిన వెంటనే సహాయక బృందాలు, సైనిక సిబ్బంది ప్రమాద స్థలానికి హుటాహుటిన చేరుకోవడంతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. ఈ ప్రమాదంలో గాయపడిన ముగ్గురు ఆర్మీ అధికారులను థైయత్లోని ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. మేజర్ హంజా ఆరిఫ్ మరణించినట్లు డాక్టర్లు ధృవీకరించారు. గాయపడిన లెఫ్టినెంట్ ఆయుష్మాన్, లెఫ్టినెంట్ అభినవ్ రాథోర్‌కు చికిత్స అందిస్తున్నారు. ఒంటె కూడా అక్కడికక్కడే చనిపోయిందని పోలీస్ అధికారి తెలిపారు.
మరోవైపు ఈ ప్రమాదంలో మరణించిన ఆర్మీ మేజర్ హంజా ఆరిఫ్, మధ్యప్రదేశ్‌కు చెందిన వారని ఆర్మీ అధికారులు తెలిపారు. నెల రోజుల క్రితమే ఆయనకు వివాహం జరిగినట్లు చెప్పారు. స్థానిక పోలీసులు, మిలిటరీ సంయుక్తంగా ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Rajasthan : Army Major killed, 2 Lieutenants injured after SUV hits camel in Jaisalmer.
The deceased officer has been identified as Major Hamza Arif, a resident of Madhya Pradesh, who reportedly got married just a month ago.
He was driving the Army vehicle when the accident… pic.twitter.com/ZNnG9wrif1
— News Arena India (@NewsArenaIndia) July 31, 2026