న్యూఢిల్లీ: జపాన్‌కు చెందిన ఒక పర్యాటకుడు స్కూటర్ వెనుక కూర్చొని ప్రయాణించాడు. అయితే హెల్మెట్ ధరించనందుకు ట్రాఫిక్ పోలీసులు వెయ్యి జరిమానా కట్టాలని డిమాండ్ చేశారు. రసీదు ఇవ్వకుండా ఆ డబ్బును లంచంగా తీసుకున్నారు. (Cops Suspended) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ముగ్గురు ట్రాఫిక్ పోలీసులను సస్పెండ్ చేశారు. ఢిల్లీ శివారు ప్రాంతమైన హర్యానాలోని గురుగ్రామ్‌లో ఈ సంఘటన జరిగింది. జపాన్‌కు చెందిన కైటో అనే పర్యాటకుడు భారత్‌లో పర్యటించాడు. అయితే హెల్మెట్ లేకుండా స్కూటర్ వెనుక ఆయన ప్రయాణించినందుకు గురుగ్రామ్ ట్రాఫిక్ పోలీసులు వెయ్యి జరిమానా కట్టాలని డిమాండ్ చేశారు. ‘ఇక్కడ కడతావా లేక కోర్టులోనా?’ అని ఆ జపాన్ వ్యక్తిని బెదిరించారు. ఆన్లైన్లో చెల్లిస్తానని అతడు కోరగా దానికి ఒప్పుకోలేదు. నగదుగా చెల్లించాలని చెప్పారు. జపాన్ వ్యక్తి నుంచి రెండు రూ.500 నోట్లు తీసుకున్నారు. అయితే జరిమానాకు సంబంధించి ఎలాంటి రసీదు ఇవ్వలేదు. ఆ డబ్బును లంచంగా వారు తీసుకుని అతడ్ని వదిలేశారు.
కాగా, జపాన్ టూరిస్ట్ రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇది పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో గురుగ్రామ్ ట్రాఫిక్ డీసీపీ దీనిపై స్పందించారు. జపాన్ పర్యాటకుడి నుంచి లంచం తీసుకున్న ట్రాఫిక్ పోలీస్ అధికారి కరణ్ సింగ్, కానిస్టేబుల్ శుభం, హోంగార్డ్ భూపేందర్‌ను వెంటనే సస్పెండ్ చేసినట్లు ఎక్స్‌లో పేర్కొన్నారు. అవినీతిని సహించబోమని, ప్రజా సేవలో అత్యున్నత ప్రమాణాలకు కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు. ఇలాంటి సంఘటనలను తమ దృష్టికి తీసుకురావాలని పౌరులను కోరారు.
మరోవైపు లంచం తీసుకున్న అవినీతి పోలీసులను కేవలం సస్పెండ్ చేయడంపై నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘వారిని కొన్ని రోజులు జైలులో ఎందుకు ఉంచకూడదు?’ అని ఒకరు ప్రశ్నించారు. ‘లంచం తీసుకోవడం నేరం కాదా? అరెస్ట్ చేసి వారి ఫొటోలను సాధారణ ప్రజలకు షేర్ చేయాలి’ అని మరొకరు డిమాండ్ చేశారు. ‘ప్రభుత్వ ఉద్యోగికి సస్పెన్షన్ నిజానికి వారికి మంచి విషయం. తమ నల్లధనాన్ని ఆస్వాదించడానికి సెలవు లభిస్తుంది. అలాగే 50-70 శాతం జీతం కూడా పొందుతారు’ అని మరొకరు వ్యాఖ్యానించారు.
WTH! Gurugram cops took ₹1000 bribe from a Japanese tourist without even giving a receipt. This is how they ruin India’s image abroad. pic.twitter.com/upcFdRcCkB
— Deadly Kalesh (@Deadlykalesh) September 1, 2025
Also Read:
Woman’s Severed Head | కలకలం రేపిన తెగిన మహిళ తల.. భర్త అరెస్ట్
Ganesh Procession | గణేష్ ఊరేగింపులోకి దూసుకెళ్లిన వాహనం.. ముగ్గురు మృతి, 22 మందికి గాయాలు