నల్గొండలో ఓ కారు బీభత్సం సృష్టించింది. అన్లిమిటెడ్ షాపింగ్ మాల్ ఎదుట జాతీయ రహదారిపై మితిమీరిన వేగంతో దూసుకెళ్లింది. ఒక ద్విచక్రవాహనం, రోడ్డుపై సఫాయి చేస్తున్న మున్సిపల్ కార్మికురాలిని ఢీకొట్టింది.
ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. స్కూటీపై వెళ్తున్న యువకుడి తలకు తీవ్ర గాయమైంది. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో ఐకాన్ హాస్పిటల్కు తరలించారు. అలాగే మున్సిపల్ కార్మికురాలి రెండు కాళ్లు విరిగిపోయాయని సమాచారం. కారు డ్రైవర్ నిర్లక్ష్యం, అతి వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న టూ టౌన్ పోలీసులు కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.