DJ Sound | డీజే శబ్దాలను ఎందుకు నియంత్రించట్లేదు.. యూపీలో చిన్నారి మృతిపై హైకోర్టు ఆగ్రహం
DJ Sound | ఉత్తర ప్రదేశ్‌లోని బలరాంపూర్ జిల్లాలో భారీ డీజే శబ్దాలకు 2వ తరగతి చదువుతున్న విద్యార్థిని తరగతిగదిలోనే కుప్పకూలి చనిపోయిన ఘటన సంచలనం రేపింది. ఈ ఘటనపై అలహాబాద్ హైకోర్టు సుమోటోగా కేసును స్వీకరించింది.
DJ Sound | లక్నో : ఉత్తర ప్రదేశ్‌లోని బలరాంపూర్ జిల్లాలో భారీ డీజే శబ్దాలకు 2వ తరగతి చదువుతున్న విద్యార్థిని తరగతిగదిలోనే కుప్పకూలి చనిపోయిన ఘటన సంచలనం రేపింది. ఈ ఘటనపై అలహాబాద్ హైకోర్టు సుమోటోగా కేసును స్వీకరించింది. తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, అయినా ప్రభుత్వాలు ఎందుకు నియత్రించట్లేదని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
సెప్టెంబర్ 22న స్కూల్ ముందు నుంచి వెళ్తున్న ఊరేగింపులో భారీ డీజే శబ్దాలు రావడం వల్లే విద్యార్థిని చనిపోయిందంటూ స్కూల్ యాజమాన్యం ఆరోపించడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. డీజే శబ్దాల కారణంగానే విద్యార్థిని చనిపోయిందని తాము నిర్ధారించలేమని జస్టిస్ రాజస్ రాయ్, జస్టిస్ మంజీప్ శుక్లాతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. కాకపోతే అత్యధిక డెసిబుల్ స్థాయిలో డీజే శబ్దాలు వినిపించడంతోనే చిన్నారి చనిపోయింది కాబట్టి దీన్ని తీవ్రంగా పరిగణించి కేసును స్వీకరించామని ధర్మాసనం వెల్లడించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

