జైపూర్: రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే (Vasundhara Raje) రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్‌తో రహస్యంగా సమావేశమయ్యారు. ఈ ప్రత్యేక భేటీ సుమారు 20 నిమిషాలు కొనసాగింది. జోధ్‌పూర్‌లో రెండు రోజుల పర్యటనలో ఉన్న బీజేపీ సీనియర్ నాయకురాలు వసుంధర రాజే, గురువారం రామ్‌డియోరా మందిరానికి వెళుతూ లాల్ సాగర్ ప్రాంతంలోని ఆదర్శ్ విద్యా మందిర్‌లో మోహన్ భగవత్‌ను కలిశారు. వారిద్దరి ప్రత్యేక సమావేశం సుమారు 20 నిమిషాలు కొనసాగింది. ఆమె సన్నిహితులు, పార్టీ నేతలు ఎవరూ కూడా సమావేశ గదిలో లేరు.
కాగా, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌తో వసుంధర రాజే ఏం చర్చించారు, ఏం మాట్లాడారు అన్నది తెలియలేదు. అయితే కొంత కాలంగా బీజేపీ కార్యకలాపాలకు ఆమె దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆకస్మికంగా మోహన్ భగవత్‌ను ప్రత్యేకంగా కలుసుకోవడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది.
అనంతరం జోధ్‌పూర్‌లోని రెండు పుణ్యక్షేత్రాలైన సురాసాగర్‌లోని బడా రామద్వారా, రైకా బాగ్‌లోని జుగల్‌జోడి ఆలయాన్ని వసుంధర రాజే సందర్శించారు. సేనాచార్య అచలానంద గిరి మహారాజ్‌ను ఆమె కలిశారు. అలాగే పోఖ్రాన్ సమీపంలోని రామ్‌డియోరా మందిరాన్ని కూడా వసుంధర రాజే సందర్శించారు.
Also Read:
Watch: డీఎంకే కౌన్సిలర్ కాళ్లు పట్టుకుని క్షమాపణ కోరిన దళిత అధికారి.. వీడియో వైరల్
Cops Suspended | జపాన్ టూరిస్ట్ నుంచి లంచం తీసుకున్న పోలీసులు.. వీడియో వైరల్‌తో సస్పెండ్