Cell Tower | ఆరోగ్యానికి కలిగించేలా నిబంధనలకు విరుద్ధంగా సెల్ టవర్ నిర్మించాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని బ్రాహ్మణపల్లి గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇండ్ల మధ్యలో సెల్ టవర్ నిర్మించొద్దని పెద్దపల్లి మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో గ్రామస్తులు ఆందోళన బాట పట్టారు. ఈ మేరకు బుధవారం స్థానిక గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచ్ మేకల రోజారాణి యాదవ్ ఆద్వర్యంలో ప్రత్యేక సమావేశం పేరుతో గ్రామసభను నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామానికి చెందిన రిటైర్డ్ ఆర్మీ జవాన్ మేకల విజయ్ యాదవ్ మాట్లాడుతూ.. గ్రామంలో నిబంధనలకు విరుద్దంగా ప్రజలకు ప్రాణసంకటంగా మారేందుకు కారణం కాబోతున్న సెల్ టవర్ నిర్మాణాన్ని నిలిపివేయాలని, గ్రామస్తులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలనే ఉద్దేశంతో గ్రామసభను ఏర్పాటు చేశారని అన్నారు. ఎయిర్టెల్ సెల్ టవర్ ఏర్పాటుతో రేడియేషన్ మూలంగా అనారోగ్య సమస్యలు ఏర్పడతాయన్నారు.
గ్రామానికి కొద్ది దూరంలో సెల్ టవర్ను ఏర్పాటు చేసుకోవాలని ఎయిర్టెల్ యజమాన్యాన్ని కోరినా వినకుండా గ్రామంలోని పోచమ్మ దేవాలయం కోసం కేటాయించిన స్థలంలో సెల్ టవర్ ఏర్పాటుకు గ్రామానికే చెందిన ఓదెల రాజు అనే రైతు తన భూమిగా పేర్కొంటూ తనకు అన్ని అనుమతులున్నాయని చెబుతున్నాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఎలాంటి గ్రామపంచాయతీ తీర్మానం లేకుండా సెల్ టవర్ నిర్మాణం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

Pahalgam Attack: పెహల్గామ్ ఉగ్రదాడి.. చైనా సాయం కోరిన ఎన్ఐఏ కోర్టు
Dragon | మే 20న ‘డ్రాగన్’ విస్ఫోటనం .. ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ కోసం మేకర్స్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు!
Sircilla | సిరిసిల్ల జిల్లాలో ఉపాధి కూలీలపై తేనెటీగల దాడి.. 10 మందికి గాయాలు