హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అసెంబ్లీని ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ సతీశ్ మహానా దంపతులు సందర్శించారు. వారికి స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ స్వాగతం పలికారు. శాసనసభ నిర్వహణపై ఇరువురు స్పీకర్లు చర్చించారు. అనంతరం సతీశ్ మహానా దంపతులను స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో కౌన్సిల్ సెక్రటరీ డాక్టర్ వీ నరసింహాచార్యులు, అసెంబ్లీ సెక్రటరీ రేండ్ల తిరుపతి, అధికారులు పాల్గొన్నారు.