ఆర్డీఎస్‌పై ఎక్స్పర్ట్ కమిటీ నివేదికను ఆమోదించండి
రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్) ఆనికట్‌కు సంబంధించి నిపుణుల కమి టీ చేసిన సిఫారసులను ఆమోదించడంతోపాటు, వాటిని తక్షణం అమలు చేయాలని తెలంగాణ సర్కార్ కోరింది.
- ఆధునికీకరణ పనులు చేపట్టండి
- తుంగభద్ర జలాలపై హైపవర్ కమిటీ భేటీలో తెలంగాణ విజ్ఞప్తి
హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్) ఆనికట్‌కు సంబంధించి నిపుణుల కమి టీ చేసిన సిఫారసులను ఆమోదించడంతోపాటు, వాటిని తక్షణం అమలు చేయాలని తెలంగాణ సర్కార్ కోరింది. తుంగభద్ర జలాలపై ఏర్పాటుచేసిన హైపవర్ కమిటీకి విన్నవించింది. తుంగభద్ర జలాల నీటి వినియోగం, బేసిన్ రాష్ర్టాల మధ్య నెలకొన్న వివాదాలు, సమస్యల పరిష్కారం కోసం కేంద్రం ఇటీవలనే తొమ్మిది మందితో హైపర్ కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీ చైర్మన్, సీడబ్ల్యూ సీ చీఫ్ ఇంజినీర్ సోమవారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి వర్చువల్‌గా తొలిసారి సమావేశాన్ని నిర్వహించారు.
ఈ భేటీలో తుంగభద్ర రిజర్వాయర్‌లో పూడిక స్థాయి, తద్వారా తగ్గిన నీటినిల్వ సామర్థ్యం, సాగు, తాగునీరు, జలవిద్యుత్తు ఉత్పత్తిపై పడే ప్రభావం, పూడిక తొలగింపు సాంకేతిక, ఆర్థిక అంశాలు, నివారణ మార్గా లు, నావలి రిజర్వాయర్ నిర్మాణ ఆవశ్యకత, దిగువ రాష్ర్టాల నీటి వాటాకు కలిగే నష్టం, ఆర్డీఎస్ సమస్యలు తదితర అంశాలపై చర్చించారు. తెలంగాణ అధికారులు ఆర్డీఎస్కు సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించా రు. ఆర్డీఎస్ ఆనికట్‌కు సంబంధించి గతంలో నియమించిన నిపుణులు కమిటీ పలు సూచనలు చేసిందని, ఆధునికీకరణ పనులకు సైతం మార్గదర్శకాలు జారీ చేసిందని గుర్తుచేశారు. ఆ కమిటీ నివేదికను హైపవర్ కమిటీ ఆమోదించడంతోపాటు, వాటిని అమలుకు చర్యలు చేపట్టాలని కోరారు. హైపవర్ కమిటీ భేటీలో తుంగభద్ర జలాశయంలో పూడిక సమస్యపై కూడా చర్చించారు. దీనిపై 15 రోజుల్లోగా పూర్తి అభిప్రాయాలు వెల్లడిస్తామని తెలిపారు. భేటీలో తెలంగాణ నుంచి ఈఎన్సీ రమేశ్‌బాబు, ఇంటర్‌స్టేట్ అధికారులు వర్చువల్‌గా పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

