లక్నో: ఒక వ్యక్తికి ఇన్‌స్టాగ్రామ్‌లో 52 ఏళ్ల మహిళ పరిచయమైంది. ఫిల్టర్‌తో యంగ్‌గా కనిపించేందుకు ఆమె ప్రయత్నించింది. ఆ తర్వాత వారిద్దరి మధ్య రిలేషన్షిప్ ఏర్పడింది. తనను పెళ్లి చేసుకోవాలని, ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వాలని ఆమె డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో ప్రియుడైన వ్యక్తి ఆ మహిళను హత్య చేశాడు. ఉత్తరప్రదేశ్‌లో ఈ సంఘటన జరిగింది. మెయిన్‌పురికి చెందిన 26 ఏళ్ల అరుణ్ రాజ్‌పుత్‌కు ఫరూఖాబాద్ జిల్లాకు చెందిన 52 ఏళ్ల రాణి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైంది. నలుగురు పిల్లలున్న ఆమె తన వయసు తెలియకుండా ఫొటోలో యంగ్‌గా కనిపించేందుకు ఇన్‌స్టాలోని ఫిల్టర్‌ను వినియోగించింది.
కాగా, ఏడాదిపాటు ఇన్‌స్టాగ్రామ్‌లో చాటింగ్ చేసిన వీరిద్దరూ రెండు నెలల కిందట మొబైల్ నంబర్లు షేర్ చేసుకున్నారు. దీంతో ఫోన్లలో మాట్లాడుకున్నారు. ఫరూఖాబాద్‌లోని హోటల్స్‌లో పలుసార్లు కలుసుకున్నారు. అరుణ్‌కు అప్పుగా రూ.1.5 లక్షలు రాణి ఇచ్చింది. వారిద్దరి మధ్య సంబంధం ఏర్పడింది. దీంతో తనను పెళ్లి చేసుకోవాలని కొన్ని రోజులుగా అతడిని ఒత్తిడి చేసింది. అలాగే తన డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేసింది.
మరోవైపు తనకంటే రెట్టింపు వయస్సున్న రాణిని వదిలించుకోవాలని అరుణ్ భావించాడు. ఆగస్ట్ 11న మెయిన్‌పురికి ఆమెను రప్పించాడు. కర్పారి గ్రామం సమీపంలో చున్నీతో గొంతునొక్కి హత్య చేశాడు. ఆమె మొబైల్ ఫోన్లు తీసుకుని పారిపోయాడు. రాణి హత్యపై దర్యాప్తు చేసిన పోలీసులు కాల్ డేటా, ఇన్స్టాగ్రామ్ ద్వారా నిందితుడైన అరుణ్‌ను గుర్తించారు. చివరకు అతడ్ని అరెస్ట్ చేశారు.
కాగా, పెళ్లై పిల్లలున్న రాణి తన కంటే తక్కువ వయసు మహిళగా ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైనట్లు అరుణ్ చెప్పాడని పోలీస్ అధికారి తెలిపారు. రెట్టింపు వయస్సున్న ఆమె పెళ్లికి ఒత్తిడి చేయడం, ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేయడంతో హత్య చేసినట్లు అతడు ఒప్పుకున్నట్లు చెప్పారు. ఈ కేసుపై మరింతగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
Woman’s Severed Head | కలకలం రేపిన తెగిన మహిళ తల.. భర్త అరెస్ట్
Cops Suspended | జపాన్ టూరిస్ట్ నుంచి లంచం తీసుకున్న పోలీసులు.. వీడియో వైరల్‌తో సస్పెండ్