– గుర్తింపు సంఘం ఏఐటీయూసీ డిమాండ్
రుద్రంపూర్, మార్చి 06 : జీకే ఓసి నుండి జెవిఆర్ఓసికి డిప్యూటేషన్‌పై పంపిన కార్మికులను వెంటనే తిరిగి వెంకటేష్ ఖని ఓపెన్ కాస్ట్లో నియమించాలని, కోల్ క్రషర్స్, బొగ్గు రవాణా అన్నీ కూడా సింగరేణి సిబ్బందితోనే నడిపించాలని వి కే సి ఎం కు సరైన సిబ్బంది,ఇన్ఫ్రాస్ట్రక్షర్స్ని సమకూర్చాలని డిమాండ్ చేస్తూ కొత్తగూడెం ఏరియా బ్రాంచ్ సెక్రెటరీ మల్లికార్జున్ రావు, కేంద్ర కార్యదర్శి వంగా వెంకట్ సారధ్యంలో శుక్రవారం కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ శాలెం రాజుకు మెమోరాండం అందించారు. కొత్తగూడెం ఏరియా గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ నాయకులు మాట్లాడుతూ.. కొత్తగూడెం ఏరియాలోని గౌతంఖని ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ మూసేసిన తర్వాత కొత్తగూడెం ఏరియా నుండి వివిధ ఏరియాలకు అలాగే సత్తుపల్లి ఏరియాకు డిప్యూటేషన్ మీద పంపినటువంటి కార్మికులందరినీ కూడా తిరిగి వెంటనే వీ కే సీ ఎం లో నియమించాలని కోరారు.
వికే సి ఎం ప్రైవేటీకరణ చేసినట్లయితే కొత్తగూడెంలో కార్మికుల సంఖ్య తగ్గిపోతే కొత్తగూడెం ఏరియాలో ప్రజానీకం, వ్యాపారవర్గం కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మనుగడ లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎట్టిపరిస్థితిలో డిప్యుటేషన్ మీద వెళ్లిన కార్మికులను తిరిగి వికేసిఎంలో నియమించి కొత్తగూడెం ఏరియాను కాపాడాలని ఈ సందర్భంగా బ్రాంచ్ కార్యదర్శి మల్లికార్జున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏరియా వైస్ ప్రెసిడెంట్ రాములు, సెంట్రల్ కౌన్సిల్ మెంబర్ హుమాయిన్, వికే సి ఎం పిట్ సెక్రటరీ ఎంఆర్కే ప్రసాద్, ఏరియా స్టోర్స్ పిట్ సెక్రెటరీ కమల్, వర్క్ షాప్ పిట్ సెక్రటరీ మధు కృష్ణ, రాజేశ్వరరావు, సాంబమూర్తి, బండారి మల్లయ్య, రమణ, సురేశ్, సాయి పవన్, రవి పాల్గొన్నారు.