నారాయణపేట : అధికారం ఉంది కదా అని కాంగ్రెస్ నాయకులు( Congress Leaders ) రెచ్చిపోతున్నారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన బీఆర్ఎస్ ( BRS ) నాయకులపై విరుచుకు పడుతున్నారు. దౌర్జన్యాలకు, దాడులకు పాల్పడుతూ పల్లెలో బీభత్సం సృష్టిస్తున్నారు. అడ్డువచ్చిన ప్రజలను, నాయకులపై ఇష్టారీతిన దాడులు చేస్తూ ఉల్లా కేసులు బనాయిస్తూ పోలీసు స్టేషన్లో ఉంచుతున్నారు.
నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలం తిప్రాస్ పల్లి గ్రామ మాజీ సర్పంచ్ సుమంగళ భర్త నారాయణ ( Narayana ) పై గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడిన నారాయణను చికిత్స కోసం జిల్లా దవాఖానకు తరలించారు.
గ్రామ కంఠంలోని ఓ ప్రభుత్వ స్థలం విషయంలో మాజీ సర్పంచ్ కుటుంబ సభ్యులతో ప్రస్తుత సర్పంచ్ అనుచరులు గొడవకు దిగి దాడి చేశారు. కాంగ్రెస్ నాయకుల దాడిన బీఆర్ఎస్ నాయకులు, గ్రామస్థులు తీవ్రంగా ఖండించారు. దాడులకు పాల్పడ్డ వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.