Nitish Kumar | రాజ్యసభకు నితీష్ కుమార్.. జేడీయూలో కలకలం.. నితీష్ పునరాలోచించాలంటున్న పార్టీ నేతలు
Nitish Kumar : బిహార్ సీఎం నితీష్ కుమార్ రాష్ట్ర రాజకీయాల్ని వదిలి కేంద్రంలోకి వెళ్లడం ఖాయమైంది. ఆయన రాజ్యసభ ఎంపీ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. అధికారికంగా ఎన్నిక కావాల్సి ఉంది.
Nitish Kumar : బిహార్ సీఎం నితీష్ కుమార్ రాష్ట్ర రాజకీయాల్ని వదిలి కేంద్రంలోకి వెళ్లడం ఖాయమైంది. ఆయన రాజ్యసభ ఎంపీ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. అధికారికంగా ఎన్నిక కావాల్సి ఉంది. ఆయన నియామకంపై ప్రకటన వచ్చిన తర్వాత సీఎం పదవికి రాజీనామా చేస్తారు. అయితే, ఇదే ఇప్పుడు నితీష్ కుమార్‌కు చెందిన జేడీయూ నేతల్ని కలవరపెడుతోంది. ఆ పార్టీ భవితవ్యంపై నేతలు, కార్యకర్తల్లో ఆందోళన మొదలైంది. ఇంతకాలం ఆయన రాష్ట్రంలోనే ఉంటూ పార్టీని చూసుకునేవారు.
ఇప్పుడు ఆయన కేంద్రానికి వెళ్తే పార్టీని నడిపించేవారు ఉండరు. ఇతరులు పదవుల్లో ఉన్నా గతంలోలాగా పార్టీ నడుస్తుందా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే నితీష్ నిర్ణయాన్ని సొంత పార్టీ నేతలే వ్యతిరేకిస్తున్నారు. నితీష్ తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బిహార్‌లో అనేక చోట్ల జేడీయూ నేతలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. పలు చోట్ల పార్టీ కార్యాలయాల ముందు కార్యకర్తలు, నాయకులు ఆందోళన చేస్తున్నారు. నితీష్ బిహార్ సీఎంగానే ఉండాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సాధారణ నేతలే కాకుండా పార్టీలోని కీలక నేతలు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇప్పుడు ఇది పార్టీలో సంచలనంగా మారింది. ఈ అంశంపై జేడీయూ అధికార ప్రతినిధి నీరజ్ కుమార్ స్పందించారు. పార్టీని నిర్మించింది కార్యకర్తలే అని, వారి ఆందోళనను పరిగణనలోకి తీసుకుని నితీష్ కుమార్ సరైన నిర్ణయం తీసుకోవాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు.
ఈ అంశంలో నితీష్ పునర్నిర్ణయం తీసుకుంటారేమో అని, అది ఆయన చేతుల్లోనే ఉందని నీరజ్ అన్నారు. నితీష్ నిర్ణయం పార్టీ నేతలు, కార్యకర్తలతోపాటు ప్రజల్లోనూ ఆందోళన కలిగిస్తోందన్నారు. నితీష్ నాయకత్వం వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిందని నీరజ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పార్టీలో నితీష్ నాయకత్వాన్ని ఎవరు భర్తీ చేస్తారనే విషయంలో కూడా పార్టీ నేతల్లో ఆందోళన ఉందన్నారు. దీనిపై కూడా నితీష్ ఆలోచించాలని ఆయన కోరారు. ఇక.. నితీష్ తర్వాత బిహార్ సీఎం పదవిని బీజేపీ చేపట్టనుంది. అయితే, ఈ అంశంలో బిహార్ ప్రతిపక్షం ఆర్జేడీ తీవ్ర విమర్శలు చేస్తోంది. బీజేపీ చేతిలో నితీష్ కీలుబొమ్మ అంటూ ఆర్జేడీ అంటోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Bihar
- CM
- JDU
- Nitish Kumar
RELATED ARTICLES
తాజా వార్తలు
Assaulting CJP Protesters | సీజేపీ నిరసనకారులపై ‘హిందూ రక్షా దళ్’ వ్యక్తులు దాడి.. నలుగురు అరెస్ట్
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

