చెన్నై: దళిత ప్రభుత్వ అధికారి డీఎంకే కౌన్సిలర్ కాళ్లు పట్టుకున్నాడు. (Dalit official falls at DMK councillor’s feet) ఆమెను బతిమాలడంతోపాటు క్షమాపణ కోరాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో తమిళనాడులోని అధికార డీఎంకే ప్రభుత్వంపై బీజేపీ మండిపడింది. విల్లుపురం జిల్లాలోని తిండివనం మున్సిపాలిటీ కార్యాలయానికి డీఎంకే నేతలు చేరుకున్నారు. దళిత ప్రభుత్వ ఉద్యోగి మునియప్పన్ను ఒక పత్రం కోసం కౌన్సిలర్ రమ్య, ఆమె భర్త రాజా డిమాండ్ చేశారు. ఆలస్యం చేయడంతో తనను కులం పేరుతో దూషించినట్లు ఆయన ఆరోపించాడు. ఈ నేపథ్యంలో కొందరు అధికారుల బలవంతంతో కౌన్సిలర్ రమ్య కాళ్లపై పడి క్షమాపణ చెప్పినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే డీఎంకే కౌన్సిలర్ రమ్య ఈ ఆరోపణలను ఖండించింది.
కాగా, బీజేపీ నేత కే అన్నామలై ఈ వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అధికార డీఎంకేపై ఆయన మండిపడ్డారు. ‘సామాజిక న్యాయం పార్టీగా డీఎంకే నమ్మిస్తుంది. కానీ సామాజిక అన్యాయాన్ని మాత్రమే పాటిస్తుంది’ అని ఆయన ఆరోపించారు.
This is DMK’s model of Social Justice.
A public servant belonging to the Scheduled Caste community in Tindivanam was cornered continuously by DMK Councillors and was made to apologise by falling at the feet of the DMK Councillor Ramya. This is not the first time DMK has… pic.twitter.com/XrjNvtPvAN
— K.Annamalai (@annamalai_k) September 3, 2025
Also Read:
Cops Suspended | జపాన్ టూరిస్ట్ నుంచి లంచం తీసుకున్న పోలీసులు.. వీడియో వైరల్‌తో సస్పెండ్