భగీరథయత్నంలో దగాపడ్డ కుటుంబం.. ఇద్దరు బిడ్డల్ని బావిలోకి తోసి మహిళ ఆత్మహత్య
క్షణికావేశంలో తన ఇద్దరు పిల్లలతోపాటు తల్లి బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో చోటుచేసుకున్నది. భూత్పూరు మండలం వెల్కిచర్లకు చెందిన బీరయ్య, జంగమ్మ దంపతులు. వీరికి జ్యోతి (14), శైలజ(12), కుమారుడు జశ్వంత్ సంతానం.
- అప్పుచేసి బోరు వేసినా నీళ్లు పడక మరో ప్రయత్నం
- వద్దని వారించిన భార్య…
- ససేమిరా అన్న రైతు
భూత్పూర్, మార్చి 12 : క్షణికావేశంలో తన ఇద్దరు పిల్లలతోపాటు తల్లి బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో చోటుచేసుకున్నది. భూత్పూరు మండలం వెల్కిచర్లకు చెందిన బీరయ్య, జంగమ్మ దంపతులు. వీరికి జ్యోతి (14), శైలజ(12), కుమారుడు జశ్వంత్ సంతానం. వీరికి గ్రామ శివారులో రెండెకరాల పొలం ఉన్నది. బుధవారం వ్యవసాయ భూమిలో 300 ఫీట్ల లోతు వరకు బోరు డ్రిల్లింగ్ చేయించగా నీళ్లు పడలేదు. గురువారం మరో బోరు డ్రిల్లింగ్ చేయించడానికి సిద్ధమయ్యాడు.
ఈ విషయమై అతడి భార్య వద్దని వారించినా వినలేదు. భర్త తన మాట వినడం లేదన్న క్షణికావేశంలో ముగ్గురు పిల్లలను తీసుకొని గ్రామ సమీపంలోని వ్యవసాయ బావి వద్దకు వెళ్లింది. అక్కడ ఇద్దరు ఆడపిల్లలను బావిలోకి తోయగా.. అప్రమత్తమైన కొడుకు అక్కడి నుంచి తప్పించుకొన్నాడు. తర్వాత శైలజ బావిలో దూకగా.. ముగ్గురు మృతి చెందారు. విషయం తెలిసిన వెంటనే స్థానికులు బావి వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. సీఐ రామకృష్ణ, ఎస్సై చంద్రశేఖర్ ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను బయటకు తీసి జిల్లా దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

