ఇంఫాల్: మణిపూర్‌లోని కీలకమైన జాతీయ రహదారి-2ను తిరిగి తెరిచేందుకు కుకీలు అంగీకరించారు. (Kukis agree to reopen NH-2) ఆ రాష్ట్ర జీవనాధారమైన ఈ జాతీయ రహదారిని ప్రయాణికులు, సరుకు రవాణా కోసం తెరిచేందుకు కుకీ, జోమి తెగలకు చెందిన సామూహిక వర్గం నిర్ణయించింది. ప్రధాని మోదీ త్వరలో మణిపూర్‌ను సందర్శించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో జాతీయ రహదారి 2లో స్వేచ్ఛా కదలికలకు అనుమతిస్తామని చురాచంద్‌పూర్‌కు చెందిన కుకీ జో కౌన్సిల్ ఇచ్చిన హామీని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ గురువారం ధృవీకరించింది. మణిపూర్‌లోని రెండు డజన్లకు పైగా ఉన్న కుకీ, జోమి, హ్మార్ తిరుగుబాటు గ్రూపులకు చెందిన రెండు సంయుక్త సంస్థలతో వివాదాస్పదమైన సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్స్ (ఎస్‌వోఎస్) ఒప్పందాన్ని పునరుద్ధరించినట్లు ప్రకటించింది.
కాగా, మణిపూర్ ప్రాదేశిక సమగ్రతకు భంగం వాటిల్లకుండా శాశ్వత శాంతి, స్థిరత్వాన్ని తీసుకురావడానికి చర్చల పరిష్కారం అవసరమని కుకీ తిరుగుబాటు గ్రూపులు, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం భావించాయి. ఈ నేపథ్యంలో గురువారం ఢిల్లీలో జరిగిన త్రైపాక్షిక సమీక్షా సమావేశంలో ఈ మేరకు కొత్త ఒప్పందంపై సంతకం చేశారు.
మరోవైపు కీలకమైన జాతీయ రహదారి మార్గంలో శాంతి కోసం భద్రతా దళాలతో కలిసి పనిచేస్తామని కుకీ-జో కౌన్సిల్ పేర్కొంది. తమ శిబిరాలను సంఘర్షణ ప్రాంతాల నుంచి దూరంగా తరలించడానికి అంగీకరించింది. అలాగే సమీపంలోని సీఆర్పీఎఫ్ లేదా బీఎస్ఎఫ్ శిబిరాలకు ఆయుధాలను తరలించేందుకు కూడా ఒప్పందం కుదిరింది. దీంతో జాతుల ఘర్షణలతో అల్లాడిన మణిపూర్‌లో ఈ కొత్త ఒప్పందం శాంతికి ఊతమియ్యనున్నది.
Also Read:
Car Rams Truck | వేగంగా లారీని ఢీకొట్టిన కారు.. ఐదుగురు వ్యాపారులు మృతి
Vasundhara Raje | ఆర్ఎస్ఎస్ చీఫ్‌తో.. వసుంధర రాజే రహస్య సమావేశం
Watch: దూకాలని సవాల్ చేసిన భర్త.. మేడ పైనుంచి కిందకు దూకిన భార్య