వాషింగ్టన్, ఫిబ్రవరి 22: దక్షిణ అమెరికాలో 70 మిలియన్ (ఏడు కోట్ల) సంవత్సరాల నాటి పురాతన మాంసాహార జాతి డైనోసార్ గుడ్డును కొందరు పరిశోధకులు ఇటీవల కనుగొన్నారు. అర్జెంటీనాకు చెందిన నేచురల్ సైన్సెస్ లేబరేటరీ (లేస్)కు చెందిన టీమ్ జరిపిన ఈ పరిశోధనలో ఆ గుడ్డులో మాంసాహార డైనోసార్ పిండం అయి ఉండొచ్చని వారు నమ్ముతున్నారు.
దీంతో ఆ గుడ్డుకు మైక్రో-సీటీ స్కాన్ చేసేందుకు వారు సిద్ధమవుతున్నారు. ఒక వేళ ఆ గుడ్డులో కనుక పిండం ఉంటే అది శాస్త్రజ్ఞులు సాధించిన ఘనతగా పేర్కొనవచ్చు. అలా కాకుండా అది జీవ స్థితిలో ఉండకపోతే దాని అస్థి పంజరం ఆ గుడ్డులో ఉండవచ్చునని భావిస్తున్నారు.