అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో నివసిస్తున్న భారతీయుడు జాక్‌పాట్ కొట్టాడు. ఆ దేశ లాటరీలో సుమారు రూ.35 కోట్లు గెలుచుకున్నాడు. (Indian Wins Rs 35 Crore Jackpot) స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత తన కుటుంబంతో గడుపుతాని అతడు చెప్పాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 30 ఏళ్ల సందీప్ కుమార్ మూడేళ్ల కిందట యూఏఈకి వెళ్లాడు. దుబాయ్ డ్రైడాక్స్‌లో టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు.
కాగా, ఆగస్ట్ 19న సందీప్ తన బృందంతో కలిసి లాటరీ టికెట్ నంబర్ 200669ను కొనుగోలు చేశాడు. మూడు నెలల నుంచి క్రమంగా లాటరీ టికెట్లు కొంటున్నాడు. సెప్టెంబర్ 3న జరిగిన అబుదాబి బిగ్ టికెట్ సిరీస్ 278 డ్రాలో 15 మిలియన్ల యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దిర్హం (సుమారు రూ.35 కోట్లు) గ్రాండ్ ప్రైజ్‌ను గెలుచుకున్నాడు.
మరోవైపు బిగ్ టికెట్ నిర్వహకుల నుంచి ఈ ఫోన్ కాల్ అందుకున్న సందీప్ కుమార్ ఆనందంతో ఉప్పొంగిపోయాడు. భారత్‌లో ఉన్న తన కుటుంబాన్ని పోషించడానికి, ముఖ్యంగా తన తండ్రి ఆరోగ్యం కోసం ఈ డబ్బు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపాడు. భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత సొంత వ్యాపారం ప్రారంభిస్తానని చెప్పాడు.
తన జీవితంలో మొదటిసారి చాలా ఆనందంగా ఉందని గల్ఫ్ న్యూస్‌తో సందీప్ అన్నాడు. బిగ్ టికెట్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. తన మాదిరిగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న వారికి ఒక సందేశాన్ని ఇచ్చాడు. ‘మీరు ప్రయత్నిస్తే, మీరు కూడా గెలుస్తారు’ అని చెప్పాడు.
Also Read:
MP Judge Gets Rs 5 Billion Threat | బతకాలంటే ఐదు బిలియన్లు ఇవ్వు.. జడ్జీకి బెదిరింపు లేఖ
Kukis agree to reopen NH-2 | జాతీయ రహదారి 2ను తెరిచేందుకు కుకీలు అంగీకారం.. మణిపూర్‌లో శాంతికి ఊతం
Car Rams Truck | వేగంగా లారీని ఢీకొట్టిన కారు.. ఐదుగురు వ్యాపారులు మృతి