Telangana University | తెలంగాణ యూనివర్సిటీలో విద్యార్థుల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి శివారులో ఉన్న వర్సిటీలోని సౌత్ క్యాంపస్ వసతీగృహంలో మంగళరవా అర్ధరాత్రి విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది.
హోలీ సంబరాల అనంతరం సీనియర్, జూనియర్ విద్యార్థులు రెండు గ్రూపులుగా విడిపోయి పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ కొట్లాటలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న వర్సిటీ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని విద్యార్థులను చెదరగొట్టారు. అనంతరం గాయపడిన వారికి చికిత్స అందించారు. వసతీగృహం వద్దకు స్థానిక ఎస్సై ఆంజనేయులు, వార్డెన్ డాక్టర్ యాలాద్రి అక్కడకు చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు