Varun Tej | మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం ‘కొరియన్ కనకరాజు’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయం సాధించింది. ఈ నేపథ్యంలో నిర్వహించిన సక్సెస్ మీట్లో హీరో వరుణ్ తేజ్ ఇటీవల సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన సీనియర్ ఎన్టీఆర్ “అమెచ్యూరిష్” డైలాగ్ వివాదంపై స్పందించారు.
సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ క్లాసిక్ మూవీ ‘యుగపురుషుడు’ చిత్రంలోని డైలాగ్‌ను కమెడియన్ సత్య ఇమిటేట్ చేయడంపై నందమూరి అభిమానుల నుంచి వ్యక్తమవుతున్న వ్యతిరేకతపై వరుణ్ తేజ్ క్లారిటీ ఇచ్చారు. తాము కావాలని ఏనాడూ ఎన్టీఆర్‌ను టార్గెట్ చేయలేదని, ఆ సన్నివేశాన్ని ప్రమోషన్ల కోసం ప్లాన్ చేసి ఇప్పుడు రానియలేదని స్పష్టం చేశారు. అసలు ఆ సీన్‌ను తాము గతేడాది నవంబర్ నెలలోనే షూట్ చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. ఇమిటేషన్‌కు, ట్రోలింగ్‌కు మధ్య చాలా తేడా ఉంటుంది. మేము కేవలం సినిమాలోని సందర్భానుసారం ఇమిటేట్ చేసామే తప్ప, ఎవరినీ కించపరచాలని అనుకోలేదు. ఈ చిత్రంలో కేవలం ఎన్టీఆర్ గారిని మాత్రమే కాకుండా, ప్రమోషన్లలో భాగంగా ఇతర దిగ్గజ నటులైన కృష్ణ గారిని కూడా ఇమిటేట్ చేయడం జరిగింది అని తెలిపారు.