లక్నో: డెలివరీ బాయ్ ఒక ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించాడు. బెడ్‌పై నిద్రిస్తున్న బాలుడి మెడపై కత్తి ఉంచి మహిళను బెదిరించాడు. బలవంతంగా ఆమెతో దుస్తులు విప్పించి రికార్డ్ చేశాడు. (Delivery Man Forces Woman To Strip) ఆ వీడియోతో ఆ మహిళను బ్లాక్మెయిల్ చేశాడు. ఆమె ఫిర్యాదుతో ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ శివారు ప్రాంతమైన ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఈ సంఘటన జరిగింది. గులిస్తాన్పూర్కు చెందిన 22 ఏళ్ల గౌరవ్ ఒక మహిళ ఇంటికి పాలు, కిరాణా సామాగ్రి డెలివరీ చేసేవాడు. ఒక రోజు ఉదయం ఆమె ఇంట్లోకి బలవంతంగా అతడు ప్రవేశించాడు. బెడ్‌పై నిద్రిస్తున్న మహిళ కుమారుడి మెడపై కత్తి ఉంచాడు. ఆ బాలుడ్ని చంపుతానని బెదిరించాడు. బలవంతంగా ఆమెతో బట్టలు విప్పించాడు. మొబైల్ ఫోన్లో దానిని రికార్డ్ చేశాడు.
కాగా, గౌరవ్ ఆ వీడియోతో మహిళను బ్లాక్మెయిల్ చేశాడు. ఆమె కుమారుడు, కుమార్తెను కిడ్నాప్ చేస్తానని, అహ్మదాబాద్‌లో పని చేస్తున్న భర్తకు ఆ వీడియో పంపుతానని బెదిరించాడు. అంతేగాక మహిళ భర్తకు ఆ వీడియోను షేర్ చేశాడు. సోషల్ మీడియాలో కూడా వైరల్ చేశాడు.
మరోవైపు ఈ విషయం తెలుసుకున్న బాధిత మహిళ సెప్టెంబర్ 2న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో గౌరవ్‌ను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. అతడి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Man Shoots Wife Dead | ‘నా డబ్బు తినేస్తున్నది’.. భార్యను కాల్చి చంపిన భర్త
Fake IAS Officer | నకిలీ ఐఏఎస్ అధికారి గుట్టురట్టు.. పలు లగ్జరీ కార్లతో బిల్డప్