లక్నో: ఒక మహిళ తన కుటుంబానికి వ్యతిరేకంగా ఒక వ్యక్తిని పెళ్లి చేసుకున్నది. పుట్టింట్లోనే ఉంటూ ఐఏఎస్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నది. అయితే దివ్యాంగుడైన సోదరుడు తల్లితో కలిసి కుట్రపన్నాడు. గన్‌తో కాల్చి సోదరిని హత్య చేశాడు. (Woman Shot Dead By Brother) ఆత్మహత్య చేసుకున్నట్లు నమ్మించేందుకు వారు ప్రయత్నించారు. అయితే పరువు హత్యగా పోలీసులు నిర్ధారించారు. ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 24 ఏళ్ల మాన్వీ మిశ్రా ఈ ఏడాది జనవరిలో తన కుటుంబానికి వ్యతిరేకంగా ప్రేమ వివాహం చేసుకున్నది. బరేలీకి చెందిన ప్రభుత్వ స్కూల్ ప్రిన్సిపాల్ అభినవ్ కటియార్‌ను ఆర్య సమాజ్ సంస్థ ద్వారా పెళ్లాడింది. అలాగే కోర్టు రిజిస్ట్రేషన్ ద్వారా కూడా వీరు పెళ్లి చేసుకున్నారు.
కాగా, ఐఏఎస్‌కు ప్రిపేర్ అవుతున్న మాన్వీ, అలియాపూర్ గ్రామంలోని తల్లి ఇంట్లో ఉంటున్నది. ఆగస్ట్ 31న ఇంట్లో అనుమానాస్పదంగా ఆమె మరణించింది. మాన్వీ గన్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆమె తల్లి, దివ్యాంగుడైన సోదరుడు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు ఆ ఇంటికి చేరుకున్నారు.
మరోవైపు మాన్వీ మృతదేహాన్ని ఫోరెన్సిక్ సిబ్బంది పరిశీలించారు. ఆమె కుడి చేతిలో పిస్టల్ ఉండగా, తల ఎడమ వైపు నుంచి బుల్లెట్ దూసుకెళ్లినట్లు గుర్తించారు. దీంతో ఆమెను హత్య చేసినట్లు పోలీసులు అనుమానించారు. దివ్యాంగుడైన సోదరుడు అశుతోష్ మిశ్రాను అదుపులోకి తీసుకుని ప్రశ్నించాడు.
సోదరిని నాటు తుపాకీతో కాల్చి చంపినట్లు సోదరుడు ఒప్పుకున్నాడని పోలీస్ అధికారి తెలిపారు. తల్లితో కలిసి మాన్వీ హత్యకు కుట్ర పన్నినట్లు చెప్పాడని, దీంతో ఆమెను కూడా అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. పరువు హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
Also Read:
Man Shoots Wife Dead | ‘నా డబ్బు తినేస్తున్నది’.. భార్యను కాల్చి చంపిన భర్త
Fake IAS Officer | నకిలీ ఐఏఎస్ అధికారి గుట్టురట్టు.. పలు లగ్జరీ కార్లతో బిల్డప్
Watch: బెడిసికొట్టిన మంటలు ఊదే స్టంట్.. ఏం జరిగిందంటే?