న్యూఢిల్లీ: స్కూల్ బయట ఒక విద్యార్థిని ముగ్గురు బాలురు అడ్డుకున్నారు. అతడ్ని కత్తితో పొడిచారు. (Boy Stabbed Outside School) ఈ నేపథ్యంలో ఛాతిలో దిగిన కత్తితో ఆ బాలుడు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు. దీంతో అతడ్ని ఆసుపత్రికి తరలించగా ఆ కత్తిని డాక్టర్లు తొలగించారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. సెప్టెంబర్ 4న పహార్గంజ్ ప్రాంతంలోని స్కూల్ గేట్ వద్ద 15 ఏళ్ల బాలుడ్ని ముగ్గురు మైనర్ బాలురు అడ్డుకున్నారు. రెండు వారాల కిందట వారిలో ఒకరిపై జరిగిన దాడికి అతడు కారణమని అనుమానించారు. ఈ నేపథ్యంలో ఒక బాలుడు బీర్ బాటిల్ పగులగొట్టి చంపుతానని హెచ్చరించాడు. మరో బాలుడు కత్తితో అతడి ఛాతిలో పొడిచాడు.
కాగా, ఛాతిలో దిగిన కత్తితో ఆ బాలుడు పహార్గంజ్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు. జరిగిన సంగతి పోలీసులకు చెప్పాడు. ఆ బాలుడ్ని తొలుత కళావతి సరన్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం ఆర్ఎంఎల్ ఆసుపత్రికి తరలించారు. ఆ బాలుడి ఛాతిలో దిగిన కత్తిని అక్కడి వైద్యులు విజయవంతంగా తొలగించారు.
మరోవైపు ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలుడ్ని కత్తితో పొడిచిన 15 నుంచి 16 ఏళ్ల వయస్సున్న నిందితులైన ముగ్గురు మైనర్ బాలురను అరాం బాగ్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. దాడికి వినియోగించిన కత్తి, పగిలిన బీర్ బాటిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనపై మరింతగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Boy Accidentally Fires Air Gun | ప్రమాదవశాత్తు ఎయిర్ గన్ పేల్చిన బాలుడు.. అతడి అన్న మృతి
Nude Gang | మహిళలను బెంబేలెత్తిస్తున్న ‘న్యూడ్ గ్యాంగ్’.. డ్రోన్లతో పోలీసుల నిఘా
Mob Kills Woman | చేతబడి అనుమానంతో.. మహిళను చంపిన గ్రామస్తులు