బెంగళూరు: ఒక బాలుడు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు ఎయిర్‌గన్ పేల్చాడు. (Boy Accidentally Fires Air Gun) పెల్లెట్ తగలడంతో అతడి అన్న మరణించాడు. పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. కర్ణాటకలోని సిర్సిలో ఈ సంఘటన జరిగింది. బసప్ప ఉండియార్ అనే వ్యక్తి సోమనహళ్లి చిపగి గ్రామంలోని ఫార్మ్‌హౌస్‌లో కూలీ పని చేస్తున్నాడు. అతడి కుటుంబం అక్కడే నివసిస్తున్నది. నిర్వాహకుడు కోతులను భయపెట్టడానికి ఆ గార్డెన్ వద్ద ఎయిర్ గన్ ఉంచాడు.
కాగా, శుక్రవారం ఉదయం బసప్ప ఉండియార్కు చెందిన ఇద్దరు కుమారులు ఆ ఫార్మ్‌హౌస్ వద్ద ఆడుకుంటున్నారు. గార్డెన్ వద్ద ఉంచిన ఎయిర్‌గన్‌ను ఆరేళ్ల చిన్న కుమారుడు గమనించాడు. దానిని పట్టుకుని అనుకోకుండా ట్రిగర్ నొక్కాడు. దీంతో అతడి సమీపంలో ఉన్న అన్న అయిన తొమ్మిదేళ్ల కరియప్ప ఛాతిలోకి పెల్లెట్ దూసుకెళ్లింది. దీంతో ఆ బాలుడు అక్కడికక్కడే మరణించాడు.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ ఫార్మ్ వద్దకు చేరుకున్నారు. బాలుడి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. లైసెన్స్ లేని ఎయిర్‌గన్‌ను ఫార్మ్ వద్ద ఉంచిన నిర్వాహకుడు, ఫార్మ్ యజయానిపై కేసు నమోదు చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. మరణించిన బాలుడి తల్లి ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
Watch: సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్పై దాడికి యత్నం.. ఎందుకంటే?