లక్నో: భార్యాభర్తలు చేతబడి చేస్తున్నట్లు గ్రామస్తులు అనుమానించారు. వారి ఇంట్లోకి చొరబడి ఆయుధాలతో దాడి చేశారు. మహిళ మరణించగా ఆమె భర్త తీవ్రంగా గాయపడ్డాడు. (Mob Kills Woman) ఈ నేపథ్యంలో ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఓబ్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని పర్సోయి గ్రామానికి చెందిన 57 ఏళ్ల బాబూలాల్ ఖర్వార్, 52 ఏళ్ల రాజ్‌వంతి భార్యాభర్తలు.
కాగా, ఈ దంపతులు చేతబడి చేస్తున్నట్లు గ్రామస్తులు అనుమానించారు. గురువారం సాయంత్రం గులాబ్ అనే గ్రామస్తుడు మరికొంత మందితో కలిసి వారి ఇంటికి వచ్చాడు. చేతబడి, మంత్రవిద్యలు చేస్తున్నారన్న అనుమానంతో పదునైన ఆయుధాలతో ఆ దంపతులపై దాడి చేశాడు. దీంతో రాజ్‌వంతి అక్కడికక్కడే మరణించింది. ఆమె భర్త బాబూలాల్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ గ్రామానికి చేరుకున్నారు. మహిళను హత్యచేసిన నిందితుడు గులాబ్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
Watch: సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్పై దాడికి యత్నం.. ఎందుకంటే?